శిల్పా శెట్టి భర్తకు బెయిల్ నిరాకరణ

0 13

ముంబాయి ముచ్చట్లు :

 

ప్రముఖ బాలీవుడ్ నటి శిల్పా శెట్టి భర్త రాజ్ కుంద్రాకు ఉచ్చు బిగుస్తున్నట్టే కనిపిస్తోంది. పోర్నోగ్రఫీ కేసులో ఆయన అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. నీలి చిత్రాలను యాప్ లలో అప్ లోడ్ చేశారనే అభియోగాలను ఆయన ఎదుర్కొంటున్నారు. పలువురిని మోసం చేశారనే ఆరోపణలు కూడా ఆయనపై ఉన్నాయి. ప్రస్తుతం ఆయన జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నారు. మరోవైపు రాజ్ కుంద్రా పెట్టుకున్న బెయిల్ పిటిషన్ ను ముంబైలోని కోర్టు ఈ రోజు కొట్టివేసింది. ఆయనతో పాటు ఆయన సహచరుడు ర్యాన్ థోర్పే బెయిల్ పిటిషన్ ను కూడా నిరాకరించింది. రాజ్ కుంద్రా కస్టడీని నిన్ననే మరో రెండు వారాల పాటు కోర్టు పొడిగించింది. ఆయన కస్టడీని కోర్టు పొడిగించడం ఈ వారంలో ఇది మూడోసారి. రాజ్ కుంద్రా ఈ నెల 19న అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే.

- Advertisement -

పుంగనూరు లయ న్స్ క్ల బ్‌ నూతన కార్యవర్గం పదవిస్వీకారం

 

Tags: Shilpa Shetty’s husband denied bail

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page