శ్మశాస స్థలాన్ని కాపాడాలి

0 9

సంగారెడ్డి ముచ్చట్లు:

తమ గ్రామంలో కడ్జాలకు గురవుతున్న శ్శశానవాటికను కాపాడాలని డిమాండ్ చేస్తూ ఓ యువకుడు విద్యుత్ టవర్ ఎక్కి హల్ చల్ చేశాడు.  పోలీసులు రంగప్రవేశం చేసి యువకున్ని అదుపులోకి తీసుకున్నారు.  సంగారెడ్డి జిల్లా రామచంద్రపురం  పోలీస్ స్టేషన్ పరిధిలోని  బండ్లగూడ గ్రామం లో విద్యుత్ హైటెన్షన్ టవర్ ఎక్కి కాంగ్రెసు పార్టీ యువ కార్యకర్త ఖదీర్ ఆందోళనకు దిగాడు. గ్రామంలో స్మశాన వాటిక స్థలం కబ్జా అవుతుందని, దానిని కాపాడి అభివృద్ధి చేయాలని  డిమాండ్ చేశాడు. స్ధానిక  కాంగ్రెస్ పార్టీ యువ కార్యకర్త ఖదీర్ విధ్యుత్ హెటెన్షన్ టవర్ ఎక్కిన విషయాన్ని తెలుసుకున్న  రామచంద్రాపురం పోలీసులు  సంఘటనా స్థలానికి చేరుకొని  ఖదీర్ ను అదుపులోకి తీసుకున్నారు.  ఈ సందర్భంగా ఖదీర్ మాట్లాడుతూ.. బండ్లగూడ గ్రామ అవసరాలకు అనుగుణంగా శ్శశాన వాటిక స్ధలాన్ని వినియోగించాలని,  కొందరు వ్యక్తులు రాత్రికి రాత్రే ప్లాట్లు గా మారుస్తూ సొమ్ము చేసుకుంటున్నారని ఆరోపించారు..

 

- Advertisement -

పుంగనూరు లయ న్స్ క్ల బ్‌ నూతన కార్యవర్గం పదవిస్వీకారం

Tags:The burial ground must be protected

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page