స్వర్ణకార సంఘం భవనానికి నిధులు కేటాయించాలి

0 13

ఎమ్మెల్యే కు సంఘం సభ్యుల వినతి

జగిత్యాల  ముచ్చట్లు:
జగిత్యాల పట్టణ స్వర్ణకార సంఘం భవన నిర్మాణం కోసం నిధులు కేటాయించాలని  జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ కు సంఘం నాయకులు కోరారు.ఈ మేరకు బుధవారం జగిత్యాల ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయానికి వెళ్లిన పట్టణ స్వర్ణకార సంఘం అధ్యక్షులు ఆకోజు కృష్ణమూర్తి, ప్రధాన కార్యదర్శి ఎనగంటి రవికుమార్ ల ఆధ్వర్యంలో సభ్యులు సంజయ్ కుమార్ ను కలిసి వినతిపత్రం సమర్పించారు.ఈసందర్బంగా అధ్యక్ష, కార్యదర్శులు కృష్ణమూర్తి, రవికుమార్ లు మాట్లాడుతూ సంఘం సభ్యులు, దాతల సహకారంతో జగిత్యాల పట్టణంలోని పురానిపేటలో సంఘం భవనం నిర్మాణం చేపట్టామని ఇప్పటివరకు 50 శాతం పనులు జరిగాయని, నిధులు లేనందున భవనం పూర్తిచేయడానికి 15 లక్షలు అవసరవుతాయని వివరించారు.ఎమ్మెల్యే నిధులనుంచి రూ.15 లక్షలు కేటాయించి  సంఘం భవనం పూర్తిచేయడానికి కృషిచేయాలని వారు కోరారు.ఎమ్మెల్యే సంజయ్ కుమార్ నిధుల విషయంలో సానుకూలంగా స్పందించారని కృష్ణ మూర్తి, రవికుమార్ లు తెలిపారు.ఎమ్మెల్యే ను కలిసిన వారిలో కృష్ణ మూర్తి, రవికుమార్ లతో పాటు కట్ట ప్రభాకర్,పాంచాల శ్రీనివాస్, తుమ్మణపల్లి మోహన్, కడర్ల రవీందర్, పాంచాల ప్రభాకర్, సింహారాజు సంతోష్ తదితరులున్నారు.

- Advertisement -

పుంగనూరు లయ న్స్ క్ల బ్‌ నూతన కార్యవర్గం పదవిస్వీకారం

 

Tags:Allocate funds for the goldsmith community building

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page