32 వ డివిజన్ సచివాలయంలో ఆధార్ సెంటర్ ప్రారంభం

0 12

నెల్లూరు  ముచ్చట్లు:
నెల్లూరు గ్రామీణ నియోజకవర్గ పరిధిలోని కొత్త 32వ డివిజన్, శ్రీలంక కాలనీలోని సచివాలయంలో ఆధార్ సెంటర్ ను  నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయం ఇంఛార్జ్ కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి బుధవారం ప్రారంభించారు . ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ  ఆధార్ నమోదు, ఆధార్ కార్డులో మార్పులు, చేర్పులు కోసం ఈ ఆధార్ సెంటరును ప్రారంభించడం జరిగిందన్నారు. ప్రతీ సంక్షేమ పథకానికి ఆధార్ ఎంతో అవసరం, అలాగే ప్రతీ మనిషి నిత్య అవసరంలా ఆధార్ మారిపోయింది, ఇలాంటి పరిస్థితుల్లో ఏర్పాటు చేసిన ఈ ఆధార్ సెంటరుని ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు.పై కార్యక్రమంలో డివిజన్ ఇంఛార్జ్ బత్తల కృష్ణ, కూకాటి హరి, రఘు, ఆదిరెడ్డి, నాయబ్ రసూల్, ఖాదర్ బాషా, విజయరామిరెడ్డి, అగ్రికల్చర్ మార్కెటింగ్ కమిటీ చైర్మన్ యేసు నాయుడు, వేదగిరి లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం ఛైర్మెన్ ఇందుపూరు శ్రీనివాసులు రెడ్డి, తురక సూరి, రాజా, రాజేష్, గౌస్ బాషా, రామకృష్ణ, కరిముల్లా, లక్ష్మణ్, పల్లాల శ్రీను వైసీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

పుంగనూరు లయ న్స్ క్ల బ్‌ నూతన కార్యవర్గం పదవిస్వీకారం

 

- Advertisement -

Tags:Opening of Aadhaar Center at 32nd Division Secretariat

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page