ఊహూ.. అంటున్న కరోనా పరికరాలు

0 9

హైద్రాబాద్   ముచ్చట్లు:

ఏ తప్పు చేయకపోయినా కరోనా వారియర్లు శిక్షలకు గురవుతున్నారు. ఇప్పటి వరకు వీరులు, శూరులు అని పొగిడిన జనమే, ప్రభుత్వ నిర్లక్ష్యమే ఇందుకు కారణమని ఆగ్రహావేశాలు వ్యక్తంచేస్తున్నారు. కరోనా మహమ్మారి ప్రారంభం నుంచి అలుపెరగని పోరాటం చేస్తున్న ప్రభుత్వ వైద్య సిబ్బంది, రోగుల బంధువులకు మధ్య తరచూ వివాదాలు చోటు చేసుకుంటూనే ఉన్నాయి. సకాలంలో పరీక్షలు, చికిత్స అందకపోవడంతో సిబ్బందితో వాగ్వాదానికి దిగుతూ కొన్ని సందర్భాల్లో గొడవకు దిగుతున్నారు. ఒక ఆస్పత్రి తర్వాత మరో ఆస్పత్రి అన్నట్టు రాష్ట్రంలో ప్రతి రోజూ ఏదో ఒక హాస్పిటల్‌లో ఉద్రిక్త వాతావరణం నెలకొంటూనే ఉన్నది. ప్రభుత్వాస్పత్రుల పనితీరు మెరుగుపరచకుండా, వాటి సామర్థ్యంపై ప్రజల్లో నమ్మకం కలిగేలా ఆర్భాటమైన ప్రచారం చేయడం మూలంగా రోగుల తాకిడి పెరుగుతున్నది. మరోవైపు ఆయా ఆస్పత్రుల్లో సౌకర్యాలు మాత్రం అంతంత మాత్రంగానే ఉంటుండంతో సమస్యలు తలెత్తుతున్నాయి.
బోధనాస్పత్రుల్లో పరీక్షలు నిర్వహించే పరికరాలకు చిన్న మరమ్మతులు వచ్చినా నెలల తరబడి వాటికి మరమ్మతులు చేయకపోవడంతో ఇబ్బందులు తలెత్తుతున్నాయి. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో పరీక్షల కోసం డాక్టర్లు ప్రయివేటుకు రాస్తున్నారు.ఆర్థిక స్థోమత లేని వారు పరీక్షల కోసం రోజుల తరబడి వేచి చూడాల్సి రావడంతో రోగుల బంధువుల్లో అసహనం పెరిగి ఘర్షణకు దిగుతున్న సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. సిటి స్కాన్‌, ఎక్స్‌ రే మిషన్‌, 2డీ ఎకోతో పాటు రక్త, మూత్ర నమూనాలకు పరీక్షలు చేసేందుకు పరికరాలు చాలా ఆస్పత్రుల్లో ఉన్నా, అవి మరమ్మతులకు గురికావడం, అవి బాగై వచ్చేసరికి చాలా సమయం తీసుకుంటున్నది. గతంలో ఇలాంటి సమస్య తలెత్తగా అన్ని ప్రధాన ఆస్పత్రుల్లో బయోమెడికల్‌ ఇంజినీర్‌ పోస్టులను భర్తీ చేయడం ద్వారా ఈ సమస్యను అధిగమించాలని నిర్ణయించారు. అయితే అనుకున్న మేరకు ఈ పోస్టుల భర్తీ కాకపోవడమే సమస్య మళ్లీ, మళ్లీ ఉత్పన్నమవుతున్నట్టు వైద్య సిబ్బంది చెబుతున్నారు. ఇందుకు ప్రభుత్వం అలసత్వం కారణమవుతున్నది. తాజాగా ఇలాంటి ఘటనే వరంగల్‌ ఎంజీఎం ఆస్పత్రిలోనూ చోటు చేసుకుంది.ఎంత మంది రోగులు వస్తున్నారు? ఎంత మంది సిబ్బంది ఉన్నారు? పరీక్షించేందుకు ఎన్ని పరికరాలు న్నాయి? వాటిలో పని చేస్తున్న పరికరాలెన్ని? మరమ్మతులో ఉన్నవి ఎన్ని? తదితర వివరాలేవి పారదర్శకంగా లేకపోవడంతో తమకు పరీక్షలు చేయడంలో జాప్యానికి వైద్యసిబ్బంది కారణమని రోగుల బంధువులు భావిస్తున్నారు. దీనికి తోడు ప్రభుత్వాస్పత్రుల్లో సిబ్బందిపై అధికార పార్టీ నేతల వంధిమాగధులమని చెబుతూ బెదిరింపులకు దిగుతుండడంతో వారియర్లల్లో నిరుత్సాహం చోటు చేసుకుంటున్నది. నిరంతర భయాందోళన నడుమ వైద్యసేవలు సజావుగా అందించలేమనీ డాక్టర్లు, ముఖ్యంగా జూనియర్‌ డాక్టర్లు, నర్సులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వాస్పత్రుల్లో ఉన్న సిబ్బంది, సౌకర్యాల వివరాలను రోగులకు తెలిసేలా పారదర్శకంగా ప్రతి బోధనాస్పత్రి ముందు ఏర్పాట్లు చేయాలనే డిమాండ్‌ ముందుకొస్తున్నది.

- Advertisement -

పుంగనూరు లయ న్స్ క్ల బ్‌ నూతన కార్యవర్గం పదవిస్వీకారం

 

Tags:Uhuh .. talking corona devices

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page