కాపు రామచంద్రారెడ్డి వ్యాఖ్యాలు సరికావు

0 3

ప్రభుత్వ విప్ పై మాజీ మంత్రి కాల్వ శ్రీనివాసులు ఫైర్
రాయదుర్గం  ముచ్చట్లు:
గౌరవప్రదమైన హోదాలో ఉన్న ప్రభుత్వ విప్ కాపు రామచంద్రారెడ్డి తన స్థాయిని మరిచి పత్రికల్లో రాయని విధంగా ఛానళ్ళలో చూపించని పదజాలంతో తనపై విమర్శలు చేయడం సరికాదని రాష్ట్ర టిడిపి పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు మాజీ మంత్రి కాల్వ శ్రీనివాసులు ఫైర్ అయ్యారు. అనంతపురం జిల్లా రాయదుర్గం పట్టణంలోని ఆయన నివాసంలో గురువారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వ విప్ కాపు రామచంద్రారెడ్డి తనపై చేసిన వ్యాఖ్యల పట్ల ఘాటుగా స్పందించారు. సభ్యత, సంస్కారం లేకుండా వ్యాఖ్యలు చేయడం కాపు రామచంద్రారెడ్డి దిగజారుడు రాజకీయాలకు నిదర్శనమని మండిపడ్డారు. అభివృద్ధిలో తనతో పోటీ పడాలి కానీ తాను చేసిన తప్పులను కప్పిపుచ్చుకునేందుకు మేకపోతు గాంభీర్యం ప్రదర్శించడం సరికాదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కనేకల్ చిక్కనేశ్వర ఒడియార్ చెరువుకట్ట కు సంబంధించిన షట్టర్ల ఆధునీకరణ పనులు సకాలంలో పూర్తి చేయకపోవడంతో హెచ్ఎల్సీ జలాలు వంకలు,వాగులకు మళ్ళించి తాను ఏదో గొప్ప ఘనకార్యం చేసినట్లు చెప్పుకోవడం సిగ్గు చేటన్నారు.

పుంగనూరు లయ న్స్ క్ల బ్‌ నూతన కార్యవర్గం పదవిస్వీకారం

 

- Advertisement -

Tags:Kapu Ramachandra Reddy’s comments are incorrect

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page