కొడంగల్ లో యువజన  కాంగ్రెస్ పాదయాత్ర

0 4

మహబూబ్ నగర్     ముచ్చట్లు:
కొడంగల్ నియోజకవర్గం లో కాంగ్రెస్ యూత్ కమిటీ ఆధ్వర్యంలో పాదయాత్ర జరిగింది. రేవంత్ రెడ్డి సోదరుడు  తిరుమతి రెడ్డి ఆధ్వర్యంలో భారీ పాదయాత్ర జరిగింది. అంబేద్కర్ చౌరస్తా లో పూలమాల వేసి కొడంగల్  యూత్ కాంగ్రెస్ అద్యక్షడు కృష్ణంరాజు పాదయాత్ర ప్రారంభించారు. కొడంగల్ నుండి తాండూరు వరకు పాదయాత్ర కార్యక్రమం కొనసాగింది. అడ్డుకున్న పోలీసులకు కాంగ్రెస్ నాయకులకు మధ్య వాగ్వాదం జరిగింది. బారి కేడ్లను దాటుకుంటూ అందోళనకారులు ముందుకు వెళ్లారు. కొడంగల్  నియోజకవర్గంలో ప్రజల   సమస్యలను పరిష్కరించడంలో   తెలంగాణ ఫ్రభుత్వం విఫలం చెందదని వారు విమర్శించారు. 5 0పడకల ఆసుపత్రిని నిర్మించడంలో ఫ్రభుత్వం పూర్తిగా విఫలం అయింది.  ఇచ్చిన హామీలను నెరవేర్చలేదు. వీటిని  ఎత్తి చూపేందుకు కాంగ్రెస్ నాయకులు  పాదయాత్ర చేస్తున్నారని అన్నారు. కొడంగల్ నుంచి తాండూర్ వరకు రోడ్డు చేపట్టకపోవడం భాధా కరం. ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందిందని కాంగ్రెస్ నేతల ఆరోపించారు.  పాదయాత్రకు అనుమతులు లేవన్న  పోలీసులు, నియోజకవర్గంలోని కొడంగల్ చౌరస్తా లో భారీగా మోహరించారు. కాంగ్రెస్ నాయకులను  ముందస్తుగా అరెస్టు చేసే ప్రయత్నం చేసారు.

పుంగనూరు లయ న్స్ క్ల బ్‌ నూతన కార్యవర్గం పదవిస్వీకారం

 

- Advertisement -

Tags:Youth Congress Padayatra in Kodangal

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page