గరుడవారధి పనుల ప్రగతిపై ఈఓ సమీక్ష

0 21

తిరుమల ముచ్చట్లు:

రెండో విడతగా రూ.25 కోట్లు కేటాయింపు

- Advertisement -

గరుడవారధి పనుల ప్రగతిపై టిటిడి ఈవో డాక్టర్ కెఎస్.జవహర్ రెడ్డి గురువారం తిరుపతిలోని టిటిడి పరిపాలనా భవనంలో తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్, టిటిడి అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఈ పనుల కోసం రెండో విడతగా రూ.25 కోట్లు కేటాయించారు. దీంతో ఇప్పటివరకు టిటిడి రూ.50 కోట్లు విడుదల చేసినట్టయింది.తిరుపతి ఆర్టీసీ బస్టాండ్ నుంచి నంది సర్కిల్ వరకు వారధి పనులు పూర్తి కావచ్చాయని, ఆగస్టు నెలాఖరుకు యాత్రికులకు అందుబాటులోకి తీసుకొస్తామని ఈ సందర్భంగా మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ ఈఓకు వివరించారు.ఈ సమీక్షలో తిరుపతి కార్పొరేషన్ కమిషనర్ శ్రీ గిరీష, స్మార్ట్ సిటి జనరల్ మేనేజర్ శ్రీ చంద్రమౌళి, సూపరింటెండెంట్ ఇంజనీర్ శ్రీ మోహన్, టిటిడి ఎఫ్ఏ అండ్ సిఏవో శ్రీ బాలాజి, చీఫ్ ఇంజినీర్ శ్రీ నాగేశ్వ‌ర‌రావు పాల్గొన్నారు.

పుంగనూరు లయ న్స్ క్ల బ్‌ నూతన కార్యవర్గం పదవిస్వీకారం

 

 

Tags:EO review on the progress of Garudavaradhi works

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page