జగనన్న విద్యా దీవెన

0 11

నిధులను విడుదల చేసిన సీఎం జగన్
అమరావతి   ముచ్చట్లు:
ఈ ఏడాది రెండవ విడత విద్యాదీవెనలో భాగంగా దాదాపు 10.97 లక్షల మంది విద్యార్ధులకు రూ.693.81 కోట్లను క్యాంప్ కార్యాలయంలో బటన్ నొక్కి నేరుగా తల్లుల ఖాతాలో సీఎం  వైయస్.జగన్ మోహన్ రెడ్డి జమచేసారు.ఈ సందర్భంగా సీఎం వైయస్.జగన్ మాట్లాడుతూ పిల్లలకు మన తరపున ఇచ్చే ఆస్తి చదువు. ఈరోజు మరో మంచి కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నాం.  దేవుడి దయతో అక్షరాలా 10.97లక్షల పైచిలుకు పిల్లలకు దాదాపు రూ.694 కోట్లు నేరుగా 9,88,437 మంది తల్లుల ఖాతాల్లోకి జమచేస్తున్నాం. ఈ రాష్ట్రంలో ప్రతిచెల్లెమ్మ, ప్రతి తమ్ముడు బాగా చదవాలని, వాళ్లకు మన తరఫు నుంచి ఇవ్వదగ్గ ఆస్తి ఏదైనా ఉందంటే అంది చదువే అని నేను చాలా గట్టిగా నమ్ముతాను. మనసా, వాచా, కర్మేణా సంపూర్ణఫీజు రీయింబర్స్మెంట్ అమలు చేయాలన్న తపన, తాపత్రయం ప్రతి అడుగులోనూ కనిపిస్తుంది. దేవుడి దయ వలన ఈ కార్యక్రమం ఇవాళ చేయగలుగుతున్నామని అన్నారు.
ఉన్నత చదువులతోనే పేదరిక నిర్మూలన…
కొన్ని కొన్ని విషయాలను మనం పరిగణలోకి తీసుకొంటే ఇంకా మనం చాలా వెనకబాటులో ఉన్నాం. రాష్ట్రంలో చదువురాని వారు 2011 లెక్కలప్రకారం 33శాతం మంది ఉన్నారు. దేశంలో సగటు చూస్తే వీరు 27శాతం మంది ఉన్నారు. దేశం కన్నా రాష్ట్రం ఇంకా తక్కువ స్ధానంలో ఉందని జగన్ అన్నారు.
18 సంవత్సరాల నుంచి 23 సంవత్సరాల వయస్సులో ఉన్న పిల్లలు ఇంటర్ పూర్తైన తర్వాత ఎంతమంది కాలేజీలకు వెళ్తున్నారని చూస్తే.. ఆశ్చర్యకరమైన నంబర్లు కనిపిస్తున్నాయి. మనం బ్రిక్స్దేశాలతో పోల్చిచూసుకుంటాం. ఇవన్నీ ఒకేరకమైన ఎకానమీ ఉన్న దేశాలు. బ్రిక్స్ అంటే బ్రెజిల్, రష్యా, చైనా, సౌతాఫ్రికా, ఇండియా దేశాలతో సరిపోల్చి చూస్తాం. ఈ వయస్సు పిల్లలు ఎంత మంది ఇంటర్ తర్వాత కాలేజీలకు పోతున్నారో చూస్తే.. బ్రెజిల్లో దాదాపు 51.8 శాతం, రష్యాలో 83.4 శాతం, చైనాలో 54.7 శాతం పిల్లలు చేరుతున్నారు. మన దేశంలో కేవలం 27శాతం మాత్రమే కాలేజీలకు వెళ్తున్నారు. దాదాపు 73శాతం మంది పిల్లలకు ఇంటర్మీడియట్ అయిన తర్వాత కాలేజీల్లో చేరడంలేదు. పిల్లలు పై చదువులు చదవకపోతే, పై స్ధాయి ఉద్యోగాలు సాధించలేకపోతే పేదరికాన్ని ఎప్పుడూ తీసేయలేం.
తల్లిదండ్రులు అప్పులు పాలు కాకూడదనే…
పెద్ద చదువులు పిల్లలకు అందుబాటులోకి రావాలి. ఆ చదువులు కోసం తల్లిదండ్రులు అప్పులు పాలు కాకుండా, అవి పిల్లలకు అందుబాటులోకి వచ్చినప్పుడే వారి తలరాతలు మారుతాయని సీఎం అన్నారు. అప్పుడే మంచి ఉద్యోగాలు వస్తాయి, పెద్ద జీతాలు వచ్చే అవకాశాలుంటాయి, వారి జీవితాలు మారుతాయి. ఈ పరిస్థితుల్లో మార్పులు తీసుకురావడానికి… అధికారంలోకి వచ్చిన వెంటనే నాన్నగారు ఫీజు రియింబర్స్మెంట్ విషయంలో ఒక అడుగు ముందుకేస్తే.. జగన్ అనే నేను నాలుగు అడుగులు ముందుకు వేశాను. ఆ దిశగా అడుగులు వేస్తూ ఎస్సీ, బీసీ, ఎస్టీ, మైనార్టీలలో ప్రతి పేదవాడికి, ఓసీల్లో ఉన్న పేద పిల్లలకు పూర్తిగా ఫీజు రియింబర్స్మెంట్ ఇస్తున్నాం. వారి తల్లితండ్రులు అప్పులు పాలయ్యే పరిస్థితిని మారుస్తున్నాం.  అంతేకాక హాస్టల్ ఖర్చుల కోసం సంవత్సరానికి రూ.20వేలు ఇస్తున్నాం. వసతి ఖర్చులకోసం తల్లిదండ్రులు అప్పులు పాలు కాకూడదని కూడా మేం ఈ పథకాన్ని అమలు చేస్తున్నాం. వసతి దీవెన కింద ఈ డబ్బు ఇస్తున్నాం. అందులో భాగంగానే ఈ కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నాం. ఫీజు రియింబర్స్మెంట్, వసతి దీవెన కోసం ఇంతగా ఖర్చు చేస్తున్నామని అన్నారు.

పుంగనూరు లయ న్స్ క్ల బ్‌ నూతన కార్యవర్గం పదవిస్వీకారం

 

- Advertisement -

Tags:Jagannath Educational Blessing

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page