జగన్ ఆస్తుల కేసు విచారణ వచ్చే నెల 6వ తేదీకి వాయిదా

0 12

ఢిల్లీ ముచ్చట్లు :

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై ఈడీ నమోదు చేసిన కేసులో విచారణ ఆగస్టు 6వ తేదీకి వాయిదా పడింది. సీబీఐ కేసులతో సంబంధం లేకుండా ఈడీ కేసులపై విచారణ చేపట్టొచ్చంటూ సీబీఐ కోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై హైకోర్టును ఆశ్రయించగా.. విచారణ అనంతరం తీర్పు వాయిదా పడింది. ఈ క్రమంలో హైకోర్టు తీర్పు వచ్చే వరకు విచారణను నిలిపివేయాలన్న జగతి పబ్లికేషన్స్ దాఖలు చేసిన మెమోను పరిశీలించిన సీబీఐ కోర్టు విచారణను వాయిదా వేసింది. మరోవైపు ఎమ్మార్ కేసు విచారణ ఆగస్టు 4కు వాయిదా పడింది. కాగా, ఇండియా సిమెంట్స్ కేసులో వాదనలకు సిద్ధంగా ఉండాలంటూ ప్రధాన నిందితుడు జగన్, ఎంపీ విజయసాయిరెడ్డి, మాజీ ఐఏఎస్ శామ్యూల్ సహా రఘురాం సిమెంట్స్/భారతీ సిమెంట్స్, జగతి పబ్లికేషన్స్, కార్మెల్ ఏసియా హోల్డింగ్స్ లిమిటెడ్ తరపు న్యాయవాదులను సీబీఐ కోర్టు ఆదేశించింది.

- Advertisement -

పుంగనూరు లయ న్స్ క్ల బ్‌ నూతన కార్యవర్గం పదవిస్వీకారం

 

Tags:The trial of Jagan’s assets case has been adjourned till the 6th of next month

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page