జమ్ము, హిమాచల్లో ఆకస్మిక వరదలు

0 6

16 మంది మృతి…. పలువురి గల్లంతు
అమర్నాథ్ గుహ వద్ద కుండపోత
షిమ్లా   ముచ్చట్లు:
హిమాచల్ప్రదేశ్, జమ్మూల్లో ఆకస్మిక వరదలు బీభత్సం సృష్టించాయి. 16 మంది మృతి చెందారు.   ఇళ్లు, పంటలు ధ్వంసమయ్యాయి. భారీగా ఆస్తి నష్టం వాటిల్లింది.   హిమాచల్లో వేర్వేరు ప్రాంతాల్లో తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోయారు. ఏడుగురు గల్లంతయ్యారు.   ఉదయ్పుర్ ప్రాంతంలో 12 మంది కార్మికులు వరదల్లో కొట్టుకుపోయారు. ఏడు మృతదేహాలు లభ్యమయ్యాయి. ఇద్దరిని సహాయక సిబ్బంది రక్షించారు. ముగ్గురి ఆచూకీ తెలియాల్సి ఉంది.  కుల్లూ జిల్లాలోని పార్వతి నదిలో నీటి ప్రవాహం ఆకస్మికంగా పెరగడంతో నలుగురు చనిపోయారని అధికారులు తెలిపారు.  చంబా జిల్లాలో ఇద్దరు మృతి చెందారు.  జమ్ములోని కిశ్త్వాఢ్లో ఓ గ్రామాన్ని ఆకస్మిక వరద ముంచెత్తింది.   ఈ ఘటనలో ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు.   కార్గిల్లో ఓ మినీ హైడల్ ప్రాజెక్టుకు నష్టం వాటిల్లింది.  అమర్నాథ్ పవిత్ర గుహ సమీపంలోనూ కుండపోత వర్షం కురిసింది. ఎలాంటి ప్రాణ నష్టం వాటిల్లలేదు.   జమ్ములో పరిస్థితిని కేంద్ర హోంమంత్రి అమిత్ షా సమీక్షించారు.  లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హాతో ఫోన్లో మాట్లాడారు.  వరద పరిస్థితిని కేంద్రం పర్యవేక్షిస్తోందని ప్రధాని మోదీ ట్వీట్ చేశారు.

 

పుంగనూరు లయ న్స్ క్ల బ్‌ నూతన కార్యవర్గం పదవిస్వీకారం

- Advertisement -

Tags:Sudden floods in Jammu and Himachal Pradesh

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page