జాగింగ్‌ చేస్తున్న జడ్జిపైకి దూసుకెళ్లిన ఆటో..అక్కడికక్కడే మృతి

0 22

రాంచీ ముచ్చట్లు :

 

ఆటో ఢీకొన్న ఘటనలో జిల్లా జడ్జి మృత్యువాతప డిన ఘటన జార్ఖండ్‌ ధన్‌బాద్‌లో బుధవారం చోటుచేసుకుంది. ధన్‌బాద్‌ జిల్లా అడిషినల్‌, సెషన్స్‌ జడ్జి ఉత్తమ్‌ ఆనంద్‌ బుధవారం ఉదయం మేయిన్‌ రోడ్డుపై జాగింగ్‌ చేస్తూ ఉన్నారు. సరిగ్గా ఐదు గంటల ప్రాంతంలో రోడ్డుపై వెళుతున్న ఓ ఆటో వెనకాలనుంచి ఆయనను ఢీకొట్టింది. ఆయన పక్కకు ఎగిరి పడ్డారు. రోడ్డు ప్రక్కన పడి ఉన్న ఆయనను గుర్తించిన కొందరు దగ్గరలోని ఆసుపత్రికి తరలించారు. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సీసీటీవీ ఫుటేజీలు కీలకంగా మారటమే కాకుండా.. పలు అనుమానాలకు తావిస్తున్నాయి. పోలీసులు దీన్ని హత్యగా అనుమానిస్తున్నారు.

- Advertisement -

పుంగనూరు లయ న్స్ క్ల బ్‌ నూతన కార్యవర్గం పదవిస్వీకారం

Tags: The car that crashed into the jogging judge died on the spot

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page