తప్పుల తడకగా వీఎంఆర్డీయే ప్లాన్లు

0 8

ఎమ్మెల్యే  వెలగపూడి రామకృష్ణ బాబు
విశాఖపట్నం  ముచ్చట్లు:
విశాఖ కే తలమానికమైన వియం ఆర్ డి ఏ తయారు చేసిన మాస్టర్ ప్లాన్ అంతా  విజయసాయి రెడ్డి ప్లాన్ అని ,వియం ఆర్ డి ఏ అంటే విశాఖ మెట్రో రీజియన్ డెవలప్ మెంట్ అథారటీ కాదని, విజయ సాయి రెడ్డి మెట్రో రీజియన్ డిస్ట్రక్షన్ అథారిటీ  అని,  తూర్పు నియోజక వర్గం ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ బాబు ఎద్దేవా చేశారు.వియం ఆర్ డి ఏ ప్లాన్ లో జరిగిన తప్పుల్ని వివరిస్తూ ఎంవీపీ కాలనీ టీడీపీ కార్యాలయం లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.  ఈ ప్లాన్ అంతా విజయసాయి రెడ్డి  ఆఫీస్ లో తయారైందని అధికారల నిర్ణయం కాదని విమర్శించారు . వియం ఆర్ డి ఏ ప్లాన్  సరైనది కాదని, ఇదంతా తప్పల తడక అని వివరించారు.  మాస్టర్ ప్లాన్ అంతా లోపబూయిష్టమని, విజయసాయి రెడ్డి భూదాహానికి దర్పణం గా వుందని ఆరోపించారు.  ఈ మాస్టర్ ప్లాన్ అమలు మొదలైతే నిరుపేదలు, సన్నకారు రైతులు పూర్తి గా  రోడ్డున పడిపోతారని ఆవేదన వ్యక్తం చేశారు . వాటర్ బాడీ లను రిక్రియేషన్ కోసం చూపడం చట్టరీత్యా నేరమన్నారు . వియం ఆర్ డి ఏ నియమించిన కన్సల్టెన్సీ స్వయంగా ప్రజలు, మేదావులు, రాజకీయ పక్షాలు సమక్షంలో క్షేత్ర స్థాయిలో సరి చేసి రూపొందించాలని డిమాండ్ చేశారు . లేదంటే న్యాయ పోరాటం చేస్తామని హెచ్చరించారు . ప్రజల తరుపున టీడీపీ అండగా వుంటుందన్నారు.

పుంగనూరు లయ న్స్ క్ల బ్‌ నూతన కార్యవర్గం పదవిస్వీకారం

 

- Advertisement -

Tags:VMRDA plans to avoid mistakes

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page