తల్లి ఆక్రమ సంభందం,కొడుకు దారుణ హత్య

0 35

నర్సీపట్నం  ముచ్చట్లు:
వివాహేతర సంబంధం నేపథ్యంలో ఇద్దరి మధ్య జరిగిన ఘర్షణ ఒకరిని బలి తీసుకుంది. దీనికి సంబంధించి సీఐ కె. శ్రీనివాసరావు చెప్పిన వివరాలు ఇలా ఉన్నాయి.  మాడుగుల ప్రాంతానికి చెందిన అనిమిరెడ్డి గిరిబాబు స్వతహాగా డ్రైవర్. కూరగాయలను కొని అమ్మకం చేస్తుంటాడు. గొలుగొండ మండలం, కె. ఎల్లవరం పంచాయితీ, జిల్లెడుపూడి గ్రామంలో  కూరగాయలు పండిస్తూ వ్యాపారం చేసుకుంటున్నాడు..ఈ క్రమంలో స్థానికంగా వున్న వివాహితతో  అక్రమ సంబంధం కొనసాగించాడు. విషయం తెలిసిన మహిళ కుమారుడు ఇరటా రాజుబాబు, తన ఇంటికి రావద్దని పలుమార్లు హెచ్చరించాడు. ఈ విషయంలో ఇద్దరి మధ్య మంగళవారం రాత్రి గ్రామంలో వివాదం జరిగింది. ఈ ఘటనలో గిరిబాబును యువకుడు రాజుబాబు బలంగా కొట్టడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. విషయం తెలుసుకున్న పోలీసులు   సంఘటన స్థలానికి చేరుకొని పోస్టుమార్టం నిర్వహించేందుకు  మృతదేహాన్ని నర్సీపట్నం ఆస్పత్రికి తరలించారు.

 

పుంగనూరు లయ న్స్ క్ల బ్‌ నూతన కార్యవర్గం పదవిస్వీకారం

- Advertisement -

Tags:Mother aggression, son brutally murdered

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page