తెలుగు సాహిత్య శిఖరం సినారె

0 14

రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి
హైదరాబాద్ ముచ్చట్లు:

తెలుగు సాహిత్య శిఖరం- సినారె అని, వారి గేయాలు, రచనలు, పాండిత్య సంపద, బహుముఖ ప్రజ్ఞాపాటవాలు అద్వితీయమని రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి కొనియాడారు.హైదరాబాద్ తెలంగాణ సారస్వత పరిషత్ లో తెలంగాణ సారస్వత పరిషత్, సుశీలా నారాయణరెడ్డి సంయుక్త ఆధ్వర్యంలో జ్ఞానపీఠ పురస్కార గ్రహీత , పద్మభూషణ్ , రాజ్యసభ సభ్యులు, మహాకవి డా.సి.నారాయణరెడ్డి 90వ జయంత్యుత్సవంలో ప్రముఖ కవి జూకంటి జగన్నాధం గారికి సినారె పురస్కారం రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అందించారు. ఈ కార్యక్రమం లో  లో సుప్రీం కోర్టు న్యాయమూర్తి జాస్తి చలమేశ్వర్, శాంత బయోటెక్ అధినేత, పద్మభూషణ్ డాక్టర్ కేఐ వరప్రసాద్ రెడ్డి, పరిషత్ చైర్మన్ ఆచార్య ఎల్లూరి శివారెడ్డి, కార్యదర్శి జుర్రు చెన్నయ్య, కోశాధికారి మంత్రి నర్సింహయ్య, ప్రముఖ కవి దేశపతి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్బంగా  ప్రముఖ చిత్రకారుడు జేవీ రూపొందించిన సినారె తైలవర్ణ చిత్రం ఆవిష్కరించారు.

 

- Advertisement -

పుంగనూరు లయ న్స్ క్ల బ్‌ నూతన కార్యవర్గం పదవిస్వీకారం

Tags:Sinare is the pinnacle of Telugu literature

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page