దేవినేని ఉమకు 14 రోజుల రిమాండ్

0 13

అమరావతి ముచ్చట్లు :

 

టీడీపీ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమను నిన్న అర్ధరాత్రి పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఆయనను హనుమాన్ జంక్షన్ పోలీస్ స్టేషన్ నుంచి జూమ్ యాప్ ద్వారా కోర్టు ముందు హాజరుపరిచారు. ఈ క్రమంలో ఆయనకు 14 రోజుల రిమాండును కోర్టు విధించింది. మరోవైపు ఆయనను రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. కొండపల్లి అటవీ ప్రాంతంలో అక్రమ మైనింగ్ జరుగుతోందనే ఆరోపణలపై నిన్న రాత్రి ఆయన పరిశీలనకు వెళ్లారు. అక్కడి నుంచి తిరిగి వస్తుండగా పోలీసులు అరెస్ట్ చేశారు. దేవినేనిపై పోలీసులు 158, 147, 148, 341, 323, 324, 307, 427, 506, 353, 332, 149 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.

 

- Advertisement -

పుంగనూరు లయ న్స్ క్ల బ్‌ నూతన కార్యవర్గం పదవిస్వీకారం

Tags: Devineni, you have been remanded for 14 days

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page