నడిరోడ్డు మీద తలపడిన ఆంబోతులు

0 11

అమలాపురం  ముచ్చట్లు:
తూర్పుగోదావరి జిల్లా అమలాపురం లో రెండు ఆంబోతులు నువ్వా.. నేనా అన్నట్టు తలపడ్డాయి. పట్టణం నడి బొడ్డున నందన్నల పోరు చూసి.. స్థానికులు భయాందోళన చెందారు. ప్రయాణికులు అరచేతిలో ప్రాణాలు పెట్టుకొని.. తమవైపు అవి రాకుంటే చాలు దేవుడా అనుకుంటూ.. అక్కడి నుంచి బయటపడ్డారు. దాదాపు గంటపాటు ఆంబోతుల పోట్లాట అందరినీ కలవరపరిచింది. ప్రధాన రహదారిపై ఆంబోతులు.పోట్లాట.. ప్రయాణికులు, వాహనదారులను తీవ్ర భయాందోళనకు గురి చేసింది. సుమారు గంటపాటు జరిగిన ఈ పోరులో.. ప్రధాన రహదారిపై వాహనదారులు నానా ఇబ్బందులు పడ్డారు.రోడ్డుపై రద్దీ తీవ్రంగా ఉండ టం.. ఆంబోతులు పోట్లాడుకుంటా ప్రయాణికుల వైపు దూసుకెళ్లటం లాంటి పరిణామాలు.. అక్కడి వారిని ఆందోళన కలిగించాయి. రహదారు లపై ఇలాంటి ఘటనలు జరగకుండా మున్సిపాలిటీ అధికారులు తగిన రీతిలో చర్యలు తీసుకోవాలని స్థానికులు విజ్ఞప్తి చేస్తున్నారు.

పుంగనూరు లయ న్స్ క్ల బ్‌ నూతన కార్యవర్గం పదవిస్వీకారం

 

- Advertisement -

Tags:Ambots confronted on the sidewalk

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page