నాటుసారా బట్టీలు ద్వంసం

0 9

తుగ్గలి  ముచ్చట్లు:
తుగ్గలి మండల పరిధిలోని రాంపల్లి గ్రామ సమీప ప్రాంతంలో నాటు సారా బట్టీలను ధ్వంసం చేసినట్లు తుగ్గలి ఎస్.ఐ షామీర్ బాషా తెలియజేశారు.గురువారం రోజున నాటు సారా బట్టీలు గల స్థావరాలపై తన సిబ్బంది తోటి దాడులను నిర్వహించి రాంపల్లి గ్రామ సమీపంలో కొండ ప్రాంతంలో ఏర్పాటు చేసిన సారా బట్టీలను ధ్వంసం చేసి, 200 లీటర్ల నాటుసారాను ధ్వంసం చేసినట్లు ఎస్సై షామీర్ బాషా తెలియజేశారు.ఈ సందర్భంగా ఎస్ఐ మాట్లాడుతూ మండల పరిధిలో సారా బట్టీల నిర్వహించిన మరియు సారా ను విక్రయించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.గ్రామాలలోని ఎవరైనా సారా బట్టీలను నిర్వహిస్తే తమకు సమాచారం ఇవ్వాలని,సమాచారం అందించిన వారి పేర్లు గోప్యంగా ఉంచుతామని ఎస్ఐ తెలియజేశారు. సమాజంలో నాటు సార నిర్మూలనకు ప్రతి ఒక్కరూ తమకు సహకరించాలని ఆయన తెలియజేశారు.ఈ కార్యక్రమంలో తుగ్గలి పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

 

పుంగనూరు లయ న్స్ క్ల బ్‌ నూతన కార్యవర్గం పదవిస్వీకారం

- Advertisement -

Tags:Destruction of Natsara distilleries

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page