పిఎంజెవికే కింద ఏపీకి ఎన్ని ప్రాజెక్టులు మంజూరు చేశారు నెల్లూరు ఎంపీ ఆదాల

0 14

నెల్లూరుముచ్చట్లు:

ప్రధానమంత్రి జన వికాస్  కార్యక్రమం
(పిఎంజివికే) కింద ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆమోదించబడిన మొత్తం ప్రాజెక్టుల సంఖ్య ఎంత, అని నెల్లూరు ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి గురువారం లోక్సభలో అడిగారు. అలాగే ఏ  ప్రాజెక్టు కింద ఏ మేరకు నిధులు, ప్రాజెక్టులు మంజూరయ్యాయని కూడా ప్రశ్నించారు. దీనికి కేంద్ర మైనారిటీ వ్యవహారాల శాఖ మంత్రి ముక్తార్ అబ్బాస్ నక్వీ రాతపూర్వకంగా సమాధానమిస్తూ ఆంధ్రప్రదేశ్లో మైనారిటీలు అధికంగా ఉండే 1300 ప్రాంతాలను గుర్తించినట్లు తెలిపారు. వారు  ఆర్థికంగా, సామాజికంగా అభివృద్ధి చెందేందుకు గాను ఆయా ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు గాను ఈ పథకాన్ని అమలు చేస్తోందని చెప్పారు. ఇందులో 7 బ్లాకులు, 12 పట్టణాలు ఉన్నాయని, అందుకుగాను 2019- 20 సంవత్సరానికి 67 ప్రాజెక్టుల ద్వారా   174.45 కోట్ల రూపాయలు కేంద్ర వాటా కింద మంజూరు చేసినట్లు తెలిపారు. ఇందులో శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా గాను 5 అదనపు తరగతి గదులకు 30 కోట్లు,9 కామన్ సర్వీస్ సెంటర్ లకు 140 కోట్లు,17 హాస్టళ్లకు 200 కోట్ల రూపాయలు మంజూరు చేసినట్లు తెలిపారు. అలాగే 4    ఐ.టి.ఐ లకు 950  కోట్లు,3 పాలిటెక్నిక్లకు 1420 కోట్లు,6 ఆశ్రమ పాఠశాలలకు1950  కోట్లు,12 టాయిలెట్ లకు 36 కోట్లు మంజూరు చేసినట్లు తెలిపారు.

- Advertisement -

పుంగనూరు లయ న్స్ క్ల బ్‌ నూతన కార్యవర్గం పదవిస్వీకారం

 

Tags:How many projects have been sanctioned to AP under PMJVK
Nellore MP Savings

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page