పోతిరెడ్డిపాడు ద్వారా నీటిని విడుద‌ల చేయ‌కుండా ఆపండి

0 4

కృష్ణా న‌దీ యాజ‌మాన్య బోర్డు కు తెలంగాణ ప్ర‌భుత్వం మ‌రో లేఖ
హైద‌రాబాద్  ముచ్చట్లు:
శ్రీశైలంలో ఆంధ్ర‌ప్ర‌దేశ్ జ‌ల విద్యుత్ ఉత్ప‌త్తి చేసుకోవ‌డానికి తెలంగాణ‌కు అభ్యంత‌రం లేద‌ని,పోతిరెడ్డిపాడు ద్వారా నీటిని విడుద‌ల చేయ‌కుండా ఆపాల‌ని కోరింది. ఈ మేరకు కృష్ణా న‌దీ యాజ‌మాన్య బోర్డు (కేఆర్ఎంబీ) కు తెలంగాణ ప్ర‌భుత్వం మ‌రో లేఖ రాసింది. త్రిస‌భ్య క‌మిటీ అనుమ‌తి లేకుండా నీటి విడుద‌ల చేయొద్ద‌ని విజ్ఞ‌ప్తి చేసింది. శ్రీశైలం, నాగార్జున సాగ‌ర్‌లో గ‌రిష్ట విద్యుత్ ఉత్ప‌త్తికి అనుమ‌తి ఇవ్వాలి. పులిచింత‌ల‌లో గ‌రిష్ట విద్యుత్ ఉత్ప‌త్తికి అనుమ‌తి ఇవ్వాల‌ని కోరింది. ఎత్తిపోత‌ల ప‌థ‌కాలు, బోర్ల‌కు విద్యుత్ ఉత్ప‌త్తి అవ‌స‌ర‌మ‌ని పేర్కొన్న‌ది. ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ర్టానికి బ‌చావ‌త్ ట్రిబ్యున‌ల్ 811 టీఎంసీలను గంప‌గుత్త‌గా కేటాయింపులు చేసింది. ఈ విష‌యాన్ని సుప్రీంకోర్టు కూడా ధృవీక‌రించింది. రెండు రాష్ర్టాల మ‌ధ్య పునఃకేటాయింపుల అంశంపై బ్రిజేష్ కుమార్ ట్రిబ్యున‌ల్ విచార‌ణ జ‌రుపుతున్నందున 2021-22 జ‌ల సంవ‌త్స‌రం నుంచి 50 :50 నిష్ప‌త్తిలో నీటి పంప‌కాలు జ‌ర‌పాల‌ని తెలంగాణ ప్ర‌భుత్వం కోరింది. బేసిన్‌లో ఉండే ప్రాంతాల అవ‌స‌రాలు తీరిన త‌ర్వాత‌నే బేసిన్ అవ‌త‌ల ఉండే ప్రాంతాల‌కు నీటిని త‌ర‌లించ‌డానికి అనుమ‌తించాల‌ని కేఆర్ఎంబీని తెలంగాణ ప్ర‌భుత్వం కోరింది.

 

పుంగనూరు లయ న్స్ క్ల బ్‌ నూతన కార్యవర్గం పదవిస్వీకారం

- Advertisement -

Tags:Stop releasing water through the pothole

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page