ప్రతిపక్షాల పని అయిపోయింది

0 8

సూర్యాపేట ముచ్చట్లు:

సూర్యాపేట జిల్లా కేంద్రంలోని మినిస్టర్ క్యాంపు కార్యాలయంలో  నూతన ఆహారభద్రత కార్డు (రేషన్ కార్డ్స్ )  లను మంత్రి జగదీష్ రెడ్డి పంపిణీ చేసారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ పెరుమళ్ళ అన్నపూర్ణ తదితరులు పాల్గోన్నారు. మంత్రి జగదీష్ రెడ్డి మాట్లాడుతూ దళిత బంధు పథకం అనగానే ప్రతిపక్షాలకు వణుకు మొదలయ్యింది. డిపాజిట్లు గల్లంతు అయి, తమ అడ్రస్ గల్లంతు అవుతుందన్న భయంతో  ప్రతిపక్షాలు రాద్ధాంతం చేస్తున్నాయి. దళిత బంధు రాష్ట్ర వ్యాప్త కార్యక్రమం..రాష్ట్రం అంత అమలు అవుతుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ ఏ పథకం చేపట్టిన  అందరి సన్షేమము కోసం, అభివృద్ధి కోసం చేపడతారు. .పైసా  లంచం లేకుండా, పారదర్శకంగా పథకాలను  అమలు చేస్తున్న ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్ కు దక్కుతుంది.మధ్య దళారులు లేకుండా నేరుగా  లబ్ధిదారుల బ్యాంక్ అకౌంట్ లోకే డబ్బులు అందిస్తున్న ఏకైక ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం. దళిత బంధు కూడా నేరుగా లబ్ధిదారులకు  లాభం జరుగుతుం.ది రాష్ట్రంలో ప్రతిపక్షాల పని అయిపోయింది.వాటిని ప్రజలు పట్టించుకోవడం లేదు..అందుకె ఉనికి కోసం  దళిత బంధు పథకం పై  రాద్దాంతం చేస్తూ అసత్యాలను ప్రచారం చేస్తున్నాయి ప్రతిపక్షాలని విమర్శించారు.

- Advertisement -

పుంగనూరు లయ న్స్ క్ల బ్‌ నూతన కార్యవర్గం పదవిస్వీకారం

Tags: The work of the opposition is over

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page