ప్రతి ఇంట్లో కరోనా బడ్జెట్

0 14

నల్గొండ   ముచ్చట్లు:

కరోనా.. ఆరోగ్యంతో పాటు ఇంటి బడ్జెట్‌నూ భారంగా మార్చింది. శానిటైజర్లు, మాస్క్‌ల వినియోగం తప్పనిసరి చేసింది. చేతుల శుభ్రత ప్రాధాన్య అంశంగా మారింది. వీటి కి తోడు రోగనిరోధక శక్తి పెంపొందించుకునేందుకు  సి– విటమిన్‌ అందించే పండ్లు, కూరగాయలతో పాటు అదనపు ఆహారంగా డ్రైఫూట్స్, గుడ్లు తీసుకోవడంతో ప్రతి ఇంటా కరోనా బడ్జెట్‌ పెరిగింది. సంపన్నకుటుంబాలకు పెద్దగా ఆర్థిక భారం కాకపోయినా సామాన్య, మధ్యతరగతి కుటుంబాలకు మాత్రం ఖర్చు భారంగా మారింది. నెలకు సుమారు రూ.1090 అదనపు ఖర్చు అవుతోంది. చేసేది లేక ప్రతి కుటుంబం నెలవారీ ఖర్చుతో పాటూ కరోనా ఖర్చును మౌనంగా భరిస్తున్నారు.  జిల్లాలో 2011 జనాభా లెక్కల ప్రకారం 23,44,474(23.4) జనాభా, 5,87,149 కుటుంబాలు ఉన్నాయి. కొత్త గణాంకాల ప్రకారం మరో 10 శాతం జనాభా ఉంటారని అంచనా. ఈ లెక్కన పెరిగిన నెలవారీ కరోనా బడ్జెట్‌ సుమారు రూ.60 నుంచి 70 కోట్లు ఉండొచ్చని అంచనా. పరిశుభ్రత ఖర్చు తప్పనిసరి కావడంతో పేద, మధ్య తరగతి కుటుంబాల నెలవారీ బడ్జెట్‌ పూర్తిగా మారిపోయింది. చాలీచాలని జీతాలు, కూలి డబ్బులతో గడిపే కుటుంబాలకు ఈ బడ్జెట్‌ భారంగా మారింది.కరోనా వైరస్‌ వ్యాప్తి తో ఇంటితో పాటు పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకో వడం అలవాటు చేసుకున్నాం. దీనికోసం శానిటైజర్లు, లైజాల్, ఫినాయిల్, హార్పిక్‌ వంటివి వినియోగం పెరిగింది.  దీంతో ప్రతినెల ఖర్చులు పెరిగాయి.

- Advertisement -

పుంగనూరు లయ న్స్ క్ల బ్‌ నూతన కార్యవర్గం పదవిస్వీకారం

 

Tags:Corona budget in every home

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page