ప్రభుత్వ ఆశయాన్ని సాధిద్దాం – ఎంపీడీఓ రాజేశ్వరి

0 140

పుంగనూరు ముచ్చట్లు:

ప్రభుత్వ ఆశయాన్ని అధికారులందరూ కలసి సాదిద్దామని ఎంపీడీఓ రాజేశ్వరి అన్నారు. గురువారం స్థానిక మండలప్రజా పరిషత్ కార్యాలయంలో ఆమె మాట్లాడుతూ గ్రామ స్వరాజ్యమే ధ్యేయంగా ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహన్ రెడ్డి గ్రామ సచివలయాల వ్యవస్థను తీసుకువచ్చారన్నారు. ఈ వ్యవస్థ ద్వారా ప్రజలకు సకాలంలో సేవలు అందుతున్నాయన్నారు. అంతేకాకుండా గత మూడు రోజులు వరకు నూతనంగా ఎన్నికైన సర్పంచులకు పాలనాపరమైన శిక్షణ ఇచ్చినట్లు ఆమె పేర్కొన్నారు. శిక్షణా కార్యక్రమంలో పాల్గొన్న సర్పంచులు గ్రామాల అభివృద్ధిపై దృష్టి పెట్టాలన్నారు. అలాగే పేదల కలలను సాకారం చేయడానికి ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహన్ రెడ్డి శ్రీకారం చుట్టిన జగనన్న గృహాలను వేగవంతం చేసే బాధ్యత కూడా సర్పంచులపై ఉందన్నారు. మండలానికి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చొరవతో సుమారు 1003 పక్కా గృహాలు మంజూరు కాగా, వాటిలో 753 ఇళ్లకు పునాదులు వేశరన్నారు. మిగిలిన 250 ఇళ్లకు కూడా పునాదులు వేయించి జిల్లాలో పుంగనూరు మండలం ప్రథమ స్థానంలో నిలిచే విధంగా అధికారులు, ప్రజాప్రతినిధులు కృషి చేయాలని ఆమె కోరారు.

 

- Advertisement -

పుంగనూరు లయ న్స్ క్ల బ్‌ నూతన కార్యవర్గం పదవిస్వీకారం

Tags:Let’s achieve the government’s ambition – MPDO Rajeshwari

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page