మీకా స్థాయి వుందా

0 5

విశాఖపట్నం ముచ్చట్లు:

పరవాడ వైయస్సార్ కార్యాలయంలో పెందుర్తి ఎమ్మెల్యే అదీప్ రాజు మీడియా సమావేశం నిర్వహించారు. ఏలూరు కార్పొరేషన్ ఎన్నికల్లో కనీసం డిపాజిట్ కూడా రాని పార్టీ టిడిపి అని విమర్శించారు. టీడీపీ మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి. నారా లోకేష్. అచ్చంనాయుడు పై అయన  ఘాటు వ్యాఖ్యలు చేసారు. ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిని విమర్శించే స్థాయి బండారుకు .లోకేషకు అచ్చెన్నాయుడు. లేదని అన్నారు. గత ప్రభుత్వం పరిపాలించిన పాలన ఎలా ఉందో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత పాలన ఎలా ఉందో ప్రజలకు బాగా తెలుసని అన్నారు.జిల్లాలోనే సీనియర్ నాయకుడు అయిన  బండారు సత్యనారాయణమూర్తి .కనీసం తన ఇంటి పక్కన ఉన్న వార్డు నెంబర్ను కూడా గెలిపించుకోలేని నువ్వు, జగన్ మోహన్ రెడ్డి . విమర్శించే స్థాయి నీకు లేదని అన్నారు. పార్టీ లేదు బొక్క లేదు అన్న అచ్చెన్నాయుడు. టిడిపి పార్టీ ని ఏవిధంగా విమర్శించాడో  అందరికీ తెలిసిన విషయమే.. ఇక రాబోయే కాలంలో టీడీపీ కి  మనుగడు కూడా ఉండదని హెచ్చరించారు. టిడిపి ప్రభుత్వంలో గడిచిన ఐదు సంవత్సరాల్లో ఎంత మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చారు తెలుసుకోండి అంటూ టిడిపిపై విమర్శలు చేసారు. తమ ప్రభుత్వం వచ్చిన తర్వాత విశాఖ జిల్లా పెందుర్తి నియోజకవర్గం 32 వేల మందికి శాశ్వత ఇల్లులు నిర్మిస్తున్నామని. ఇంటికి ముగ్గురు చొప్పున కనీసం లక్ష మందికి శాశ్వతంగా. క్విడకో హౌసింగ్. వి ఎల్ సి  ద్వారా ఇల్లు కల్పించామన్నారు. చంద్రబాబు లాగా 600 హామీలు ఇచ్చి ప్రజలను మభ్యపెట్టి నీరుగార్చే విధానం జగన్మోహన్ రెడ్డిది కాదు అని హెచ్చరించారు.

- Advertisement -

పుంగనూరు లయ న్స్ క్ల బ్‌ నూతన కార్యవర్గం పదవిస్వీకారం

 

Tags:Do you have a level?

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page