యువకుడి ప్రాణాలు తీసిన అక్రమ సంభందం

0 52

ఏలూరు ముచ్చట్లు:

ఇద్దరు యువకుల మధ్య అసహజ సంబంధం ఒక యువకుడి ప్రాణం తీసింది. డబ్బులు సరిగ్గా ఇవ్వకుండా తనతో అనైతిక సంబంధం పెట్టుకున్న యువకుడిని హత్య చేసాడు మరో యువకుడు. పశ్చిమగోదావరి పోతవరం సమీపంలో జరిగిన హత్య కేసును ఛేదించే క్రమంలో పోలీసుల విచారణలో తేలిన విషయం అందరినీ ఆశ్చర్యపరిచాయి. హత్య కేసుకు సంబంధించిన వివరాలు నల్లజర్ల పోలీస్ స్టేషన్లో కొవ్వూరు డీయస్పీ బి శ్రీనాథ్ మీడియాకు వెల్లడించారు. హతుడు పోతవరం గ్రామానికి చెందిన కొనకళ్ల వంశీ  దుర్గాపూర్ లో బిటెక్ ఫైనలియర్ చదువుతున్నాడు.  వంశీకి ఉంగుటూరు మండలం  బాదంపూడి చెందిన నిందితుడు  చింతల సత్యనారాయణకు గత సంవత్సరం డేటింగ్ యాప్ ద్వారా పరిచయం ఏర్పడింది. వీరిరువురు వారానికి ఒకసారి పోతవరం పరిసర ప్రాంతాల్లో కలుస్తూ తమ అనైతిక సంబంధాన్ని కొనసాగిస్తున్నారు.వీరిద్దరూ కలిసిన తరువాత వంశీ కొంత డబ్బును సత్యనారాయణకు ఇస్తుండేవాడు.  ఈ నేపథ్యంలో హత్య జరిగిన  రోజు  మధ్యాహ్నం  ఒంటి గంట సమయంలో  సత్యనారాయణ  పోతవరం వచ్చాడు. అప్పటి నుంచి  వంశీని రమ్మని పిలుస్తూ ఉండగా,  సాయంత్రం ఏడు గంటలకు వంశీ ఇంటి నుండి బయటకు వచ్చాడు. వారిద్దరూ కలిసి పోతవరం షుగర్ ఫ్యాక్టరీ సమీపంలో పొలాల్లో కలిసారు. అనంతరం నిందితుడు సత్యనారాయణ హతుడు  వంశీని  ఐదు వేల రూపాయలు అడిగాడు. వంశీ డబ్బులు తీసుకురాలేదని చెప్పడంతో కోపోద్రిక్తుడైన ముద్దాయి సత్యనారాయణ వంశీ  పీకపై మోచేయి వేసి అదిమి, అనంతరం మృతుని టీ షర్టు పీకకు బిగించి హత్య చేసాడు.  వంశీ చనిపోయిన తర్వాత అతని దగ్గర ఉన్న 40 రూపాయలు, అతని ఫోన్లు తీసుకుని సత్యనారాయణ  పరారయ్యాడు.  కొంతసేపటి తరువాత  వంశీ తండ్రి  వంశీకి పలుమార్లు  ఫోన్ చేసాడు. ఆ కాల్స్  రిసీవ్ చేసుకున్న సత్యనారాయణ తన అప్పులు తీర్చుకునేందుకు కొత్త ప్లాన్ వేశాడు. వంశీని కిడ్నాప్ చేసానని,  లక్ష రూపాయలు ఇస్తేనే వదులుతానని వంశీ తండ్రి శ్రీనివాస్ ను బెదిరించాడు. చివరకు ఇద్దరి మధ్య 40 వేల రూపాయలకు బేరం కుదిరింది. డబ్బులు ఇచ్చే సమయంలో మృతుడి తండ్రి శ్రీనివాస్  పోలీసులకు సమాచారం అందించారు. దాంతో  పోలీసులు నిందితుడు సత్యనారాయణను చాకచక్యంగా పట్టుకున్నట్లు డీయస్పీ  చెప్పారు..

- Advertisement -

పుంగనూరు లయ న్స్ క్ల బ్‌ నూతన కార్యవర్గం పదవిస్వీకారం

 

Tags:Illegal affair that took the lives of a young man

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page