వీడిన మిస్టరీ

0 46

చిత్తూరు     ముచ్చట్లు:
చిత్తూరు కలెక్టర్ కార్యాలయ అటెండర్ వాసు ఈనెల 18వ తేదీన అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. మృతుని కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు పది రోజుల్లో మిస్టరీని చేధించారు. మృతుని భార్యే హత్య చేసిందని తేల్చారు.ఇవాళ ఆమెను అదుపులోకి తీసుకున్నారు చిత్తూరు టూటౌన్ పోలీసులు.  చంద్రగిరి మండలం, అరిగెలవారిపల్లకు చెందిన వాసు చిత్తూరు కలెక్టర్ కార్యాలయంలో అటెండర్ గా విధులు నిర్వహిస్తున్నాడు. చిత్తురులోనే కాపురం ఉంటున్న వాసు ఈనెల 18వ తేదీన అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. మృతుని భార్య స్వప్నప్రియా మృతదేహాన్ని అంబులెన్స్ లో స్వగ్రామం తరలించి గుండెపోటుతో మృతి చెందాడని కుటుంబ సభ్యులను నమ్మించింది. వాసు మెడకు గాయాలు ఉడడంతో అనుమానం కలిగిన కుటుంబ సభ్యులు కుమారుడు వినయ్ చేత పోలీసులకు ఫిర్యాదు చేయించారు. పోస్ట్ మార్టం రిపోర్ట్ ఆధారంగా ఇవాళ చిత్తూరు టూటౌన్ పోలీసులు వాసు భార్య స్వప్నప్రియను అదుపులోకి తీసుకున్నారు. వివాహేతర సంబంధం హత్యకు కారణంగా పోలీసులు భావిస్తున్నారు. మా నాన్నను మా అమ్మే గొంతు పిసికి చంపేసిందని మృతుడు కుమారుడు వినయ్ చెప్పాడు. మొదట నుంచి తన తల్లి పైనే అనుమానం వ్యక్తం చేస్తున్నాడు వినయ్.. ఇవాళ చిత్తూరు పోలీసులు తన తల్లిని అరెస్ట్ చేసినట్లు చెప్పాడు.

పుంగనూరు లయ న్స్ క్ల బ్‌ నూతన కార్యవర్గం పదవిస్వీకారం

 

- Advertisement -

Tags:Let go of the mystery

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page