సాయం కోరిన వారికి NVR Trust సేవలు

0 29

 

పుంగనూరు  ముచ్చట్లు:

 

- Advertisement -

ఈ రోజు పుంగనూరు మండలం, చదల్ల గ్రామ వాస్తవ్యులు, ప్రముఖ పారిశ్రామికవేత్త ఎన్ వేణుగోపాల్ రెడ్డి  సారధ్యంలో నిరంతరం సేవా కార్యక్రమాలు నిర్వస్తున్న ఎన్. వి. ఆర్. ట్రస్ట్ తరపున పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు.ఇటీవల చదల్ల నివాసి బావాజాన్ (45) పాముకాటు తో మరణించారు. ఆయన కుమార్తె వివాహ ఖర్చులు నిమిత్తం రూ. 20,000 లను ఆయన కుమారుడైన సైఫ్ ఆలీకి ఎన్. వి. ఆర్. ట్రస్ట్ తరపున ఆర్ధిక సహాయం అందించారు. అలాగే చదల్ల గ్రామానికి చెందిన మహిళ పర్వీన్ కుమార్తె వివాహ ఖర్చులకు రూ.10,000 లను ఆర్థిక సహాయం గా అందించారు. పుంగనూరు పట్టణం దోబీ కాలనీ నివాసి జి. నజుండయ్య కుమార్తె MSc చదువుతుండగా, ఎన్. వి. ఆర్. ట్రస్ట్ తరపున వారి విద్యాభ్యాసం కోసం ఈ సంవత్సరం 30 వేల రూపాయలను ఆర్థిక సాయంగా ప్రకటించి, 10 వేల రూపాయల నగదును వారికి అందించారు. ఇలా పుంగనూరు మండలంలో పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న ఎన్. వి.ఆర్. ట్రస్ట్ ప్రజల ప్రశంసలను అందుకుంటోంది. ఈ కార్యక్రమంలో ఎన్. వి. ఆర్. ట్రస్ట్ వ్యవస్థాపకులు ఎన్. వేణుగోపాల్ రెడ్డి, ట్రస్ట్ సభ్యులు శివకుమార్ రెడ్డి, నరేంద్రరెడ్డి, రవికుమార్, భాస్కర్ రెడ్డి, జయపాల్ రెడ్డి, చంద్రమోహన్ రెడ్డి, వెంకటరమణ రెడ్డి, పురుషోత్తమ రెడ్డి, సందీప్ రెడ్డి పాల్గొన్నారు.

 

పుంగనూరు లయ న్స్ క్ల బ్‌ నూతన కార్యవర్గం పదవిస్వీకారం

Tags:NVR Trust services for those seeking help

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page