సౌర‌, ప‌వ‌న విద్యుత్ ఉత్ప‌త్తికి తెలంగాణా ప్రభుత్వం పెద్ద‌పీట          రాష్ట్ర ఐటీ, ప‌రిశ్ర‌మ‌ల శాఖ మంత్రి కేటీఆర్

0 12

హైద‌రాబాద్  ముచ్చట్లు:
సౌర‌, ప‌వ‌న విద్యుత్ ఉత్ప‌త్తికి తెలంగాణా ప్రభుత్వం పెద్ద‌పీట వేస్తుందని రాష్ట్ర ఐటీ, ప‌రిశ్ర‌మ‌ల శాఖ మంత్రి కేటీఆర్ తెలిపారు. సౌర విద్యుత్ ఉత్ప‌త్తిలో దేశంలో తెలంగాణ రెండో స్థానంలో ఉంద‌న్నారు. హైద‌రాబాద్ ఈ-సిటీలో సౌర ప‌రిక‌రాల ఉత్ప‌త్తి ప్లాంట్‌ను ప్రీమియ‌ర్ ఎన‌ర్జీస్ ప్రారంభించింది. ఈ కార్య‌క్ర‌మంలో ఐటీ, ప‌రిశ్ర‌మ‌ల శాఖ మంత్రి కేటీఆర్, విద్యాశాఖ మంత్రి స‌బితా ఇంద్రారెడ్డి పాల్గొని ప్రీమియ‌స్ ఎన‌ర్జీస్‌ను ప్రారంభించారు. పీవీ సెల్స్, మాడ్యూల్స్‌ను ప్రీమియ‌స్ ఎన‌ర్జీస్ ఉత్ప‌త్తి చేస్తుంది. రూ. 483 కోట్ల‌తో గ్రీన్ ఫీల్డ్ ప్రాజెక్టును ప్రీమియ‌స్ ఎన‌ర్జీస్ ఏర్పాటు చేసింది. రెండేళ్ల‌లో పెట్టుబ‌డుల‌ను రూ. 1200 కోట్ల‌కు పెంచ‌నున్న‌ట్లు ప్రీమియ‌స్ ఎన‌ర్జీస్ వెల్ల‌డించింది. ఈ సంద‌ర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. పీవీ సెల్స్, మాడ్యూల్స్ ఉత్ప‌త్తిని ప్రారంభించిన ప్రీమియ‌స్ ఎన‌ర్జీస్‌కు అభినంద‌న‌లు తెలిపారు. 18 నెల‌ల్లోనే సౌర ప‌రిక‌రాల ఉత్ప‌త్తి ప్లాంట్ ప్రారంభించారు. 700 మందికి ప్ర‌త్య‌క్ష ఉపాధి క‌ల్పించినందుకు అభినంద‌న‌లు తెలిపారు. ఉపాధి క‌ల్ప‌న ప్ర‌భుత్వం ముందున్న అతిపెద్ద స‌వాల్ అని పేర్కొన్నారు. ప్ర‌భుత్వ రంగంలో ఉన్న ఖాళీల నియామ‌కం చేప‌డుతున్నామ‌ని చెప్పారు. ప్ర‌యివేటు రంగంలో పెట్టుబ‌డుల ద్వారా ఉపాధి అవ‌కాశాలు ల‌భిస్తున్నాయ‌న్నారు. ఏడేళ్ల‌లో రాష్ర్టానికి 15 వేల‌కు పైగా ప‌రిశ్ర‌మ‌లు రాగా, సుమారు రూ. 2.20 ల‌క్ష‌ల‌కు పైగా పెట్టుబ‌డులు వ‌చ్చాయ‌ని తెలిపారు. 80 శాతానికి పైగా ప‌రిశ్ర‌మ‌లు త‌మ కార్య‌క‌లాపాలు ప్రారంభించాయ‌ని మంత్రి కేటీఆర్ గుర్తు చేశారు.

పుంగనూరు లయ న్స్ క్ల బ్‌ నూతన కార్యవర్గం పదవిస్వీకారం

 

- Advertisement -

Tags:The Telangana government is big on solar and wind power generation
State IT and Environment Minister KTR

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page