అలాస్కాలో భారీ భూకంపం

0 17

అమెరికా ముచ్చట్లు :

అమెరికాలోని అలాస్కా ద్వీపకల్పంలో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 8.2గా నమోదైంది. దీంతో అమెరికా జియోలాజికల్ సర్వే (యూఎస్‌జీఎస్) సునామీ హెచ్చరికలు జారీ చేసింది. పెర్రీవిల్లే అనే చిన్న గ్రామానికి ఆగ్నేయంగా 91 కిలోమీటర్ల దూరంలో రాత్రి 8.15 గంటలకు భూకంపం సంభవించినట్టు యూఎస్‌జీఎస్ పేర్కొంది. సముద్ర తలానికి 46.67 కిలోమీటర్ల లోతున భూప్రకంపనలు సంభవించినట్టు తెలిపింది. ఇదే ప్రాంతంలో ఆ తర్వాత కాసేపటికే 6.2, 5.6 తీవ్రతతో రెండుసార్లు భూమి కంపించింది. సునామీ హెచ్చరికలను జారీ చేసిన కాసేపటికే వాటిని రద్దు చేశారు. తాజా భూకంపం కారణంగా ఎలాంటి నష్టం సంభవించలేదు. గతేడాది అక్టోబరులో ఇక్కడే 7.5 తీవ్రతతో భూకంపం సంభవించింది. అప్పుడు కూడా ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు.

 

- Advertisement -

పుంగనూరు లయ న్స్ క్ల బ్‌ నూతన కార్యవర్గం పదవిస్వీకారం

Tags:Massive earthquake in Alaska

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page