ఆగస్టు 1న గ్రోసు గోపాలయ్య స్మారక ఉత్తమ సేవ పురస్కారాలు

0 11

నెల్లూరు ముచ్చట్లు:


 కళలను కళాకారులను ఆదరించాలని ప్రముఖ న్యాయవాది  ఏ వీ ఎస్ కృష్ణమోహన్ అన్నారు  .శుక్రవారం నెల్లూరు ప్రెస్ క్లబ్లో జరిగిన విలేకరుల   సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ  జిల్లాలో ప్రముఖ వ్యక్తి కీర్తిశేషులు  గ్రోసు గోపాలయ్య స్మారక ఉత్తమ సేవా పురస్కార ప్రదానోత్సవం  ఆగస్టు 1 వరకు తేదీ సాయంత్రం ఐదున్నర గంటలకు స్థానిక టౌన్ హాల్లో జరుగుతుందన్నారు  .సంకీర్తన కళాసమితి ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో  ఉత్తమ సేవా పురస్కారం దుగ్గిశెట్టి సుధాకర్గారికి అందజేయడం జరుగుతుందన్నారు  . గత 13 సంవత్సరాల నుంచి సింహపురి కళాభిమానులకు  సంకీర్తన కళాసమితి ఎన్నో సాహితీ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తోందన్నారు .ఆదివారం జరిగే కార్యక్రమంలో నృత్యాలు   పాటల పోటీలు నిర్వహించడం జరుగుతుందన్నారు  .ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా  అమరావతి కృష్ణా రెడ్డి ,డీఎస్పీ శ్రీనివాసరావు,నేతాజీ సుబ్బారెడ్డి,రాఘవేంద్ర శెట్టి, హజరత్బాబు నిర్మలా నర్సింహారెడ్డి  తదితరులు పాల్గొంటారన్నారు. ఈ సమావేశంలో నెల్లూరు జిల్లా రచయితల సంఘం అధ్యక్షుడు జయప్రకాశ్  .సంకీర్తన కళాసమితి  ప్రధాన కార్యదర్శి ప్రసాద్ బాబు  బి. కృష్ణ  .తదితరులు పాల్గొన్నారు

 

- Advertisement -

శ్రీ బోయకొండ గంగమ్మ కు రాహుకాల అభిషేక పూజలు

Tags: Gross Gopalaiah Memorial Best Service Awards on August 1

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page