ఆగస్టు 25కు జగన్ కేసు వాయిదా

0 14

తీర్పు వెల్లడించనున్న సీబీఐ కోర్టు

 

హైదరాబాద్ ముచ్చట్లు:

 

- Advertisement -

ఏపీ ముఖ్యమంత్రి జగన్ బెయిల్ రద్దు పిటిషన్‌పై శుక్రవారం విచారణ జరిగింది. లిఖిత పూర్వక వాదనలకుసీబీఐ మరోసారి సమయం కోరింది. సీబీఐ నుంచి ఇంకా ఎలాంటి సమాచారం రాలేదని సీబీఐ తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. మరికొంత సమయం ఇవ్వాలని కోరగా.. ఎంపీ రఘురామ తరపు లాయర్ మరింత సమయం ఇవ్వొద్దని కోర్టును కోరారు.గతంలో జగన్, పిటిషనర్ తరపు న్యాయవాదులు రిజైండర్ వేసినప్పటికీ సీబీఐ అధికారులు మాత్రం కేవలం కోర్టుకు విచక్షణ అధికారం వదిలేస్తున్నామని.. బెయిల్ రద్దు చేయాలా వద్దా అనే అంశానికి సంబంధించి న్యాయపరమైన చర్యలు కోర్టే తీసుకోవాలని రిజైండర్‌లో పేర్కొన్నారు. అదే విషయాన్ని ఆన్ రికార్డుల్లోకి తీసుకోవాలని ఈరోజు సీబీఐ తరపు న్యాయవాదలు వాదనలు వినిపించారు. ఇరుపక్షాల వాదనలు విన్న కోర్టు విచారణను ఆగష్టు 25కు వాయిదా వేసింది. కోర్టు తుది తీర్పును 25న వెల్లడించే అవకాశం ఉంది.జగన్ బెయిల్ రద్దు చేయాలంటూ నర్సాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజు కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ఈ పిటిషన్ అర్హతపై కోర్టులో వాదనలు జరిగాయి.. తర్వాత కోర్టు విచారణకు స్వీకరించింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌పై ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో 11 చార్జ్ షీట్లను సీబీఐ నమోదు చేసిందని ఎంపీ రఘురామ పిటిషన్‌లో పేర్కొన్నారు. రఘురామ జగన్‌పై నమోదైన కేసులను త్వరగతిన విచారణ పూర్తి చేయాలని.. పిటీషన్‌లో సీఎం జగన్ నిర్దోషిలా బయటపడాలన్నదే తన ఉద్దేశమన్నారు. ఈ పిటిషన్‌పై ఇప్పటికే జగన్ తరపు న్యాయవాదులు, పిటిషనర్ రఘురామకృష్ణం రాజు లాయర్లు లిఖితపూర్వకమైన వాదనలు కోర్టుకు సమర్పించారు.

శ్రీ బోయకొండ గంగమ్మ కు రాహుకాల అభిషేక పూజలు

 

Tags: Jagan’s case adjourned to August 25

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page