ఆమంచి మళ్లీ జంపా..

0 21

ఒంగోలు ముచ్చట్లు:

ఎన్నికల సమయం దగ్గరపడే కొద్దీ వైసీపీలో అసంతృప్తులు మొదలయ్యే సూచనలు కన్పిస్తున్నాయి. ఎంతలా అంటే పార్టీని వీడేటంత. అనేక చోట్ల వైసీపీ నేతల మధ్య ఉన్న విభేదాలను పరిష్కరించడంలో పార్టీ అధినాయకత్వం అట్టర్ ప్లాప్ అయింది. రెండున్నరేళ్లలో కనీసం వాటిని గురించి పట్టించుకున్న పాపాన పోలేదు. చీరాల నియోజకవర్గంలో ఆమంచి కృష‌్ణమోహన్ అసంతృప్తితో రగిలిపోతున్నారన్న వార్తలు వస్తున్నాయి.ఆమంచి కృష్ణమోహన్ వైసీపీలో ఉన్నా సంతోషంగా లేరు. ఆయనను చీరాల ఇన్ ఛార్జిగా వ్యవహరిస్తున్నా మాట చెల్లుబాటుకావడం లేదు. అంతా ఎమ్మెల్యే కరణం బలరాంకు అనుకూలంగానే వ్యవహారాలు నడుస్తున్నాయి. జిల్లా మంత్రి నుంచి హైకమాండ్ వరకూ కరణం బలరాంకు సపోర్ట్ చేస్తున్నారు. ఇది ఆమంచి కృష్ణమోహన్ కు రుచించడం లేదు. కరణం బలరాం తన వర్గాన్ని తొక్కేసే ప్రయత్నం చేస్తుండటంతో మరింతగా ఆమంచి కృష్ణమోహన్ రగిలిపోతున్నారు.చీరాలలో ఆమంచి కృష్ణమోహన్ కు మంచి పట్టుంది. ఆయన స్వతంత్ర అభ్యర్థిగానే గెలిచిన చరిత్ర ఉంది. కాపు సామాజిక వర్గానికిచెందిన ఆమంచి కృష్ణమోహన్ ను పర్చూరుకు పంపాలన్న అధిష్టానం ఆలోచననుకూడా ఆయన వర్గం తప్పుపడుతుంది. ఇతర పార్టీల నుంచి వచ్చిన కరణం బలరాంకు ఇస్తున్న ప్రాధాన్యత తమ నేతకు ఇవ్వడం లేదన్నది వారి ప్రధాన ఆరోపణ. దీనిపై ఆమంచి కృష్ణమోహన్ వర్గం తీవ్ర అసంతృప్తితో ఉంది.రోజురోజుకూ ఆయనపై వత్తిడి పెరుగుతూ ఉంది. అయితే అధికార పార్టీని వీడి ఇప్పడిప్పుడే వెళ్లడం మంచిది కాదని ఆమంచి కృష్ణమోహన్ అనుచరులకు సర్ది చెబుతున్నారు. జిల్లా మంత్రి వన్ సైడ్ గా కరణం బలరాంకు సపోర్టు చేస్తున్న విషయం హైకమాండ్ దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోవడం లేదు. దీంతో ఆమంచి కృష్ణమోహన్ పక్క చూపులు చూసే అవకాశముంది. ఆయన ఏపార్టీ అయినా తీసుకునే అవకాశముంది. ఎన్నికల సమయానికి ఆమంచి జంప్ ఖాయమన్నది చీరాలలో విన్పిస్తున్న టాక్.

- Advertisement -

పుంగనూరు లయ న్స్ క్ల బ్‌ నూతన కార్యవర్గం పదవిస్వీకారం

 

Tags:Aanchi jumpa again ..

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page