ఇంకా పెళ్లికి టైముంది : త్రిషా

0 22

చెన్నై ముచ్చట్లు:

 

వర్షం’, ‘నువ్వొస్తానంటే నేనొద్దంటానా’,‘బాడీగార్డ్‌’, ‘స్టాలిన్‌’ వంటి సినిమాల్లో నటించి తెలుగు ప్రేక్షకులను అలరించిన నటి త్రిష. తన అద్భుతమైన నటనతో తెలుగు ప్రేక్షకులను ఇంతకాలం అలరిస్తున్న ఆమె.. గత కొంతకాలంగా మాత్రం కాస్త స్లో అయ్యారు. సరైన అవకాశాలు రాకపోవడం.. వచ్చిన మంచి హిట్లు దొరక్కపోవడంతో సినిమాల విషయంలో ఆమె కాస్త గ్యాప్ ఇచ్చారు. ప్రస్తుతం లేడీ ఓరియెంటెడ్ సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తున్నారు.త్రిష పెళ్లి గురించి వార్తలు వస్తూనే ఉన్నాయి. కొన్నేళ్ల క్రితం ఆమె ఓ ప్రముఖ హీరోతో డేటింగ్‌లో ఉందంటూ పుకార్లు పుట్టుకొచ్చాయి. మరి దీంతో ఎంతవరకూ నిజం ఉందో ఎవరికీ తెలియదు. ఆ తర్వాత కూడా ఆమె మరో స్టార్ హీరోని వివాహం చేసుకోనుందంటూ వార్తలు వచ్చాయి. అవీ అవాస్తవమని తేలిపోయాయి. అయితే ఈ మధ్యకాలంలో త్రిష పెళ్లి పీటలు ఎక్కబోతుంది అంటూ గుసగుసలు వినిపించాయి. ఓ ప్రముఖ తమిళ డైరెక్టర్‌తో ఆమె ఏడు అడుగులు వేయబోతుంది అంటూ తెలిసింది. అయితే దీనిపై తాజాగా త్రిష టీమ్ క్లారిటీ ఇచ్చింది.ఆమె ఇప్పట్లో పెళ్లి చేసుకోవడం లేదంటూ స్పష్టం చేసింది. ప్రస్తుతం త్రిష దృష్టి మొత్తం సినిమాలు, నటన మీదనే ఉందని.. అది తప్ప ఆమెకు మరో ఆలోచన లేదని టీమ్ పేర్కొంది. ఇలా త్రిష పెళ్లి గురించి వచ్చిన వార్తలను నమ్మవద్దని ఆమె అభిమానులకు సూచించింది త్రిష టీమ్. కాగా ప్రస్తుతం త్రిష ‘పొన్నాయ్ సెల్వన్’, ‘సతురంగ వెట్టాయ్’ తదితర చిత్రాల్లో నటిస్తోంది.

- Advertisement -

శ్రీ బోయకొండ గంగమ్మ కు రాహుకాల అభిషేక పూజలు

Tags: Still pre-wedding: Trisha

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page