ఇక ప్రైవేట్ ఆస్పత్రులకు ఆక్సిజన్ ప్లాంట్. 

0 17

హైదరాబాద్ ముచ్చట్లు:

 

కరోనా రోగులకు ప్రాణ వాయువును అందించేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. గుర్తింపు ఉన్న ప్రతి ప్రైవేట్ ఆసుపత్రిలో తప్పనిసరిగా ఆక్సిజన్ ఫ్లాంట్లు ఏర్పాట్లు చేసుకోవాలని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. గుర్తింపు పొందిన అన్ని ప్రైవేట్ ఆస్పత్రుల్లో బెడ్ల కెపాసిటీకి తగిన మొత్తంలో ఆక్సిజన్ ప్లాంట్లు ఏర్పాటు చేయాలని ఆరోగ్య శాఖ ఆదేశించింది. ఆక్సిజన్ ప్లాంట్లు ఏర్పాటు చేయని ఆస్పత్రుల గుర్తింపును రద్దు చేయనున్నట్లు హెచ్చరించింది. ప్రాణ వాయువు ఫ్లాంట్ల కోసం నెల రోజుల గడువు ఇచ్చింది రాష్ట్ర ప్రభుత్వం.ఆగస్టు 31వ తేదీ లోపు అన్ని ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఆక్సిజన్ ప్లాంట్ల ఏర్పాటు పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది. 200 బెడ్స్‌ వరకు ఉన్న ఆస్పత్రుల్లో 500 ఎల్‌పీఎం, 200 నుంచి 500 బెడ్స్ ఉన్న ఆస్పత్రుల్లో 1000 ఎల్‌పీఎం, 500 కంటే అధికంగా బెడ్స్ ఉన్న ఆస్పత్రుల్లో 2000 ఎల్‌పీఎం కెపాసిటీ ఆక్సిజన్ జనరేషన్ ప్లాంట్లను ఏర్పాటు చేయాలని వైద్య ఆరోగ్య శాఖ పేర్కొంది. మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా 48 ప్రభుత్వ ఆసుపత్రుల్లో మొత్తం 324 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ ఉత్పత్తి ప్లాంట్లను ఏర్పాటు చేస్తోంది రాష్ట్ర ప్రభుత్వం. తేకాకుండా అదనంగా హైదరాబాద్‌లో 100 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ ప్లాంటును కూడా ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి గతంలోనే సూచించారు. ఈ నేపథ్యంలో ప్రైవేట్ ఆసుపత్రుల్లోనూ ఆక్సిజన్ ఫ్లాంట్స్ ఏర్పాటు చేసుకోవాలని కీలక ఆదేశాలు జారీ చేసింది.ఇదిలావుంటే ప్రాణ వాయువు కొరకు ఇతర రాష్ట్రాలపై ఆధారపడిన పరిస్థితిని తెలంగాణకు రాకూడదని సీఎం కేసీఆర్ గతంలోనే సూచించారు. ఒకొకటి 20 టన్నుల కెపాసిటీ గల 11 ఆక్సిజన్‌ ట్యాంకర్లను ఏర్పాటు చేశారు. ప్రైవేటు ఆసుపత్రుల్లో కంటే ఎక్కువగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో అన్ని సౌకర్యాల ఉన్నాయిని.. ప్రభుత్వ ఆసుపత్రుల్లో అందించే ఉచిత సేవను ప్రజలు ఉపయోగపడేలా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. అంతేకాకుండా ఆక్సిజన్ సరఫరాలో ఎలాంటి కొరత ఉండకూడదని ఆదేశించారు.

- Advertisement -

శ్రీ బోయకొండ గంగమ్మ కు రాహుకాల అభిషేక పూజలు

 

Tags: Oxygen plant for longer private hospitals.

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page