ఈజీ మనీ కోసం అమ్మాయిలు తప్పుడు పనులు

0 45

బెంగళూరు ముచ్చట్లు:

 

ఈజీ మనీ కోసం ఇటీవల యువత అడ్డదారులు తొక్కుతోంది. ముఖ్యంగా యువతులు తమ శరీరాలను పెట్టుబడిగా చేసుకుని బడాబాబులను వలలో వేసుకుని అందినంత దోచుకుంటున్న ఘటనలు ఇటీవల చాలా వెలుగులోకి వస్తున్నాయి. ఇలాంటి ఘటనే తాజాగా కర్ణాటకలోని మంగళూరులో చోటుచేసుకుంది. పట్టణంలోని ఉళ్లాల ప్రాంతంలోని ఓ అపార్ట్‌మెంట్‌లో సప్నా, అఫ్రీన్ అనే యువతులు నివాసముంటున్నారు. వారి పక్క ఫ్లాట్‌లో ఓ వ్యాపారవేత ఒంటరిగా నివసిస్తున్నాడు.అతడి దగ్గర బాగా డబ్బులున్నాయని తెలుసుకున్న యువతులు వ్యాపారవేత్తను వలలో వేసుకున్నారు. డిన్నర్ పేరుతో ఈ నెల 19వ తేదీ రాత్రి తమ ఫ్లాట్‌కు ఆహ్వానించారు. ముందస్తు ప్లాన్ ప్రకారం అతడు తినే ఆహారంలో మత్తుమందు కలిపారు. భోజనం చేసిన తర్వాత అతడు మత్తులోకి జారుకోగా రూ.2.12 లక్షలు నగదు, బంగారు అభరణాలను దోచుకున్నారు. మత్తులో ఉన్న అతడితో సప్నా అశ్లీలంగా వీడియోలు, ఫోటోలను తీసుకుంది.మరుసటి మత్తు నుంచి తేరుకున్న బాధితులు తన డబ్బు, నగలను తిరిగిచ్చేయాలని కోరగా బ్లాక్‌మెయిల్ చేశారు. తాము అడిగినంత డబ్బు ఇవ్వకపోతే న్యూడ్ ఫోటోలు, వీడియోలను సోషల్‌మీడియాలో పోస్టు చేసి పరువు తీస్తామని హెచ్చరించారు. దీంతో బాధితుడు ఉళ్లాల పోలీసులను ఆశ్రయించాడు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఇద్దరు యువతులను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.

 

- Advertisement -

శ్రీ బోయకొండ గంగమ్మ కు రాహుకాల అభిషేక పూజలు

Tags: Girls do wrong things for easy money

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page