ఏపీలో దిశ కేంద్రాల ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం

0 11

న్యూఢిల్లీ   ముచ్చట్లు:
ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం మహిళల భద్రత కోసం తీసుకువచ్చిన ‘దిశ’ కేంద్రాలను ఏపీలోని అన్ని జిల్లాల్లో ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. మహిళల కోసం ఏపీలో 14 దిశ కేంద్రాల ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలుపగా చిత్తూరు జిల్లాకు మంజూరు చేసిన రెండు కేంద్రాల్లో ఒకటి ఇంకా పని ప్రారంభించలేదని మంత్రి స్మృతి ఇరానీ తెలిపారు. హింసకు గురై ఇబ్బందులు ఎదుర్కొంటున్న మహిళలకు పోలీసు రక్షణ, వైద్య, న్యాయ సహాయం, న్యాయ సలహాలు, కౌన్సిలింగ్ సేవలతోపాటు వారికి ఆశ్రయం కల్పించేందుకు దిశ కేంద్రాలను తీర్చిదిద్దినట్లు మంత్రి వివరించారు. ఆపదలో ఉన్న మహిళలకు దిశ కేంద్రాల్లో రేయింబవళ్లు సేవలు అందుతున్నాయని చెప్పారు. మహిళల సాధికారతను సాధించేలా వారికి రక్షణ, భద్రత కల్పించేందుకు మిషన్ శక్తి కార్యక్రమం కింద ఆయా జిల్లాల్లో దిశ కేంద్రాల స్థాపన జరిగినట్లు మంత్రి పేర్కొన్నారు.

 

పుంగనూరు లయ న్స్ క్ల బ్‌ నూతన కార్యవర్గం పదవిస్వీకారం

- Advertisement -

Tags:Central Government approves setting up of direction centers in AP

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page