ఒలింపిక్స్‌లో చ‌రిత్ర సృష్టించింది బాక్స‌ర్ లవ్లీనా

0 14

టోక్యో ముచ్చట్లు :

 

ఒలింపిక్స్‌ లో బాక్స‌ర్ లవ్లీనా చ‌రిత్ర సృష్టించింది. ఆమె ఇండియాకు మ‌రో మెడ‌ల్‌ ఖాయం చేసింది. 64-69 కేజీల విభాగంలో శుక్ర‌వారం జరిగిన క్వార్ట‌ర్‌ఫైన‌ల్లో లవ్లీనా అద్భుత‌మైన విజ‌యం సాధించింది. చైనీస్ తైపీకి చెందిన చెన్ చిన్‌పై 4-1 తేడాతో గెలిచింది. ఈ విజ‌యంతో ఆమె సెమీఫైన‌ల్లో అడుగుపెట్టింది. బాక్సింగ్ సెమీస్ ఫ‌లితంతో సంబంధం లేకుండా ఇండియాకు మ‌రో మెడ‌ల్ ఖాయం. సెమీస్‌లో ఒక‌వేళ ల‌వ్లీనా ఓడినా.. బ్రాంజ్ మెడ‌ల్ మాత్రం ఖాయం. ల‌వ్లీనా మూడు రౌండ్ల‌లోనూ పూర్తి ఆధిప‌త్యం చెలాయించింది. తొలి రౌండ్‌లో 3:2 తో ఆధిక్యంలో ఉండ‌గా.. రెండో రౌండ్‌లో మొత్తం ఐదుగురు జ‌డ్జీలు లవ్లీనాకే 10 స్కోరు ఇచ్చారు. ఇక మూడో రౌండ్‌లో న‌లుగురు లవ్లీనా వైపే మొగ్గారు. దీంతో ఆమె 4-1తో గెలిచి సెమీస్‌లో అడుగుపెట్టింది.

- Advertisement -

పుంగనూరు లయ న్స్ క్ల బ్‌ నూతన కార్యవర్గం పదవిస్వీకారం

Tags; Boxer Lovelina made history at the Olympics

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page