కరెంట్ షాక్ తో ఆరుగురు మృతి ,మృతులంతా ఒడిశావాసులు..

0 12

గుంటూరు  ముచ్చట్లు:
గుంటూరు జిల్లా రేపల్లె మండలం లంకెవాని దిబ్బలో విషాదం జరిగింది. రొయ్యల చెరువు వద్ద విద్యుదాఘాతానికి గురై ఆరుగురు మృతి చెందారు. రొయ్యల చెరువు వద్ద కాపలాగా ఒడిశా వాసులు పని చేస్తున్నారు. రాత్రి సమయంలో చెరువు గట్టుపై ఉన్న షెడ్డులో ఉండగా ప్రమాదవశాత్తూ విద్యుత్ షాక్కు గురై ఆరుగురు మృతి చెందారు. షెడ్డుపై కరెంటు తీగలు పడటం వల్ల ప్రమాదం జరిగి ఉంటుందని భావిస్తున్నారు. మృతులు రామ్మూర్తి, కిరణ్, మనోజ్, పండబో, మహేంద్ర, నవీన్గా గుర్తించారు. షార్ట్ సర్క్యూటేనా..!ఘటనా స్థలం వద్దకు పోలీసులు మీడియాను అనుమతించడం లేదు. ఓ వైపు విద్యుత్ షార్ట్ సర్క్యూట్తో ప్రమాదం జరిగిందని అందరూ భావిస్తుండగా… షార్ట్ సర్క్యూట్ కాదని విద్యుత్ అధికారులు చెబుతున్నారు. దీంతో ప్రమాదంపై పలు అనుమానాలు తలెత్తుతున్నాయి.

 

పుంగనూరు లయ న్స్ క్ల బ్‌ నూతన కార్యవర్గం పదవిస్వీకారం

- Advertisement -

Tags:Six killed in Odisha shock, all from Odisha

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page