కర్నూలు జిల్లా 54 కలెక్టర్ గా బాధ్యతలు చేపట్టడం బాద్యతగా…అదృష్టంగా భావిస్తున్నా

0 18

జిల్లాలో ఉన్న ప్రజా ప్రతినిధులు, అధికారులు, మీడియా, జిల్లా ప్రజల సహకారంతో జిల్లాను అభివృద్ధి పధంలో నడిపిస్తా
రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి మరింత  తీసుకుని వెళ్లేందుకు చర్యలు చేపడతా
జిల్లా కలెక్టర్ పి. కోటేశ్వర రావు


కర్నూలు ముచ్చట్లు:


కర్నూలు జిల్లా 54 కలెక్టర్ గా బాధ్యతలు చేపట్టడం బాద్యతగా…అదృష్టంగా భావిస్తున్నానని జిల్లాలో ఉన్న ప్రజా ప్రతినిధులు, అధికారులు, మీడియా, జిల్లా ప్రజల సహకారంతో జిల్లాను అభివృద్ధి పథంలో నడిపిస్తానని జిల్లా కలెక్టర్ పి. కోటేశ్వర రావు అన్నారు.శుక్రవారం కలెక్టరేట్ లోని కలెక్టర్ ఛాంబర్ లో ఉదయం 10:08 గంటలకు జిల్లా 54వ కలెక్టర్ గా సర్వమత ప్రార్థనల మధ్య పురోహితులు, పాస్టర్, ఇస్లాం మత గురువు ఆశీస్సులు తీసుకొని జిల్లా కలెక్టర్ పి కోటేశ్వరరావు పదవి బాధ్యతలు చేపట్టారు.జిల్లా కలెక్టర్ పి కోటేశ్వరరావు మాట్లాడుతూ…రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి గారు తనపై ఉంచిన గురుతరమైన బాధ్యతను నిర్వర్తించేందుకు నిరంతరం శ్రమిస్తనన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి మరింత  తీసుకుని వెళ్లేందుకు చర్యలు చేపడతా అన్నారు. జిల్లాలో ఉన్న ప్రజా ప్రతినిధులు, అధికారులు, మీడియా, జిల్లా ప్రజల సహకారంతో జిల్లాను అభివృద్ధి పధంలో నడిపిస్తా అన్నారు.కర్నూలు జిల్లాలో పని చేసే అవకాశం రావడం సంతోషంగా భావిస్తున్నానని తెలిపారు. జిల్లా ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉండి సేవలు అందిస్తానని అన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికీ అందేలా చర్యలు చేపడతామన్నారు. సమ ప్రాధాన్యంతో అన్ని ప్రాంతాల అభివృద్ధికి కృషి చేస్తామన్నారు. ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందేలా చర్యలు తీసుకుంటామన్నారు.

నూతన కలెక్టర్ కు శుభాకాంక్షలు వెల్లువ :-

నూతన జిల్లా కలెక్టర్ ను అధికారులు అభినందనలతో ముంచెత్తారు. కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో జిల్లా అధికారులు వరుసగా వెళ్లి తమ పేరు, శాఖ, హోదాలతోకలెక్టర్ తో పరిచయం చేసుకొని పూలమాలలు, పుష్పగుచ్ఛాలు, పూల మొక్కలు అందజేసి జిల్లా కలెక్టర్ వారికి శుభాకాంక్షలు తెలిపారు.జాయింట్ కలెక్టర్ (అభివృద్ధి) డా.మనజీర్ జిలానీ సామూన్, జాయింట్ కలెక్టర్ (రెవిన్యూ మండల రైతు భరోసా) రామ సుందర్ రెడ్డి, జాయింట్ కలెక్టర్ (హౌసింగ్) నారపురెడ్డి మౌర్య, జాయింట్ కలెక్టర్ (ఆసరా మరియు సంక్షేమం) శ్రీనివాసులు, కర్నూలు నగర పాలక సంస్థ కమిషనర్ డి.కె.బాలాజీ, శ్రీశైలం ప్రాజెక్టు స్పెషల్ కలెక్టర్ తమీమ్ అన్సారియా, నంద్యాల సబ్ కలెక్టర్ చాహత్ బాజ్ పాయ్, ట్రైనీ అసిస్టెంట్ కలెక్టర్ నూరుల్ ఖమర్, డి ఆర్ ఓ పుల్లయ్య, ఆర్ డి ఓ హరిప్రసాద్, జిల్లా అధికారులు,  జిల్లా కలెక్టర్ వారిని మర్యాదపూర్వకంగా శుభాకాంక్షలు తెలిపారు.

శ్రీ బోయకొండ గంగమ్మ కు రాహుకాల అభిషేక పూజలు

 

- Advertisement -

Tags: It is my duty to take charge as the Collector of Kurnool District 54 … I feel lucky

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page