కర్నూలు నగర పాలక రెండవ డిప్యూటీ మేయరుగా నాయకల్లు అరుణ

0 9

-ఏకగ్రీవంగా ఎన్నికైన రెండవ డిప్యూటీ మేయర్ నాయకల్లు అరుణ
-ప్రిసైడింగ్ ఆఫిసర్ మనిజీర్ జిలానీ శామున్  అధ్వర్యంలో కౌన్సిల్ ప్రత్యేక సమావేశం.
– పాల్గొన్న మేయర్, ఎమ్మెల్యేలు,  కమిషనర్

కర్నూలు ముచ్చట్లు:

- Advertisement -

ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించాలనే ఉద్దేశంతో రాష్ట్ర పురపాలక నగరాలు/పట్టణాల్లో ఇద్దరు డిప్యూటీ మేయర్లు/వైస్ చైర్మన్లుగా పదవులు సృష్టించిన రాష్ట్ర ప్రభుత్వం దానిని ఆచరణలోని తెచ్చింది.శుక్రవారం రాష్ట్ర వ్యాప్తంగా పురపాలక నగరాలు/పట్టణ ప్రత్యేక సమావేశాలు జరిగాయి.
దీంట్లో భాగంగా కర్నూలు మున్సిపల్ కార్యాలయంలోని కౌన్సిల్ హాల్లో ప్రిసైడింగ్ ఆఫిసర్ మనిజీర్ జిలానీ శామున్  అధ్యక్షతన జరిగిన ప్రత్యేక సమావేశంలో 47వ వార్డు కార్పొరేటర్ నాయకల్లు అరుణా  రెండవ డిప్యూటీ మేయర్ గా ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ప్రిసైడింగ్ ఆఫిసర్ ప్రకటించారు.అనంతంరం మేయర్ బి.వై రామయ్య గారు, ఎమ్మెల్యేలు  హఫీజ్ ఖాన్   కాటసాని రాంభూపాల్ రెడ్డి ,  అరుణ ని అభినందించారు.సమావేశం కన్నా ముందు  ఎమ్మెల్యేలు హఫీజ్ ఖాన్ ,  కాటసాని రాంభూపాల్ రెడ్డి , మేయర్ బి.వై రామయ్య  డిప్యూటీ మేయర్ సిద్దారెడ్డి రేణుకా  నూతన డిప్యూటీ మేయర్ అరుణ తో కలిసి దివంగత మాజీ. ముఖ్యమంత్రి డా. వైయస్ రాజశేఖరరెడ్డి  విగ్రహానికి గజమాల వేశారు ఈ  కార్యక్రమంలో వైసిపి పార్టీ నాయకులు  కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు.

 

శ్రీ బోయకొండ గంగమ్మ కు రాహుకాల అభిషేక పూజలు

Tags: Leaders Aruna as the second deputy mayor of Kurnool city administration

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page