గుంటూరులో దారుణం.. ఆరుగురు సజీవ దహనం

0 19

గుంటూరు ముచ్చట్లు :

గుంటూరు జిల్లా రేపల్లె మండలం లంకెవానిదిబ్బలోని ఓ రొయ్యల చెరువు వద్ద కాపలాగా ఉన్న ఆరుగురు వ్యక్తులు అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. మృతులను ఒడిశాకు చెందిన కూలీలుగా గుర్తించారు. సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. రాత్రివేళ విద్యుదాఘాతం కారణంగానే ఈ ఘటన జరిగి ఉంటుందని చెబుతుండగా, విద్యుత్ అధికారులు మాత్రం వారి మరణానికి షార్ట్‌సర్క్యూట్ ఎంతమాత్రమూ కారణం కాదని చెబుతుండడం పలు అనుమానాలు రేకెత్తిస్తోంది. మరోవైపు, ఘటనా స్థలం వద్దకు మీడియాను అనుమతించడం లేదు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

 

- Advertisement -

పుంగనూరు లయ న్స్ క్ల బ్‌ నూతన కార్యవర్గం పదవిస్వీకారం

Tags:Atrocities in Guntur .. Six people burnt alive

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page