గుర్తు తెలియని వాహనం ఢి కొని ఎలుగుబంటి మృతి

0 17

అనంతపురం  ముచ్చట్లు:
అనంతపురం జిల్లా,కళ్యాణదుర్గం పట్టణ సమీపంలో  శుక్రవారం ఉదయం అనంతపురం వెళ్లే రహదారి లో  ఒంటి మిద్ద  గ్రామ సమీపంలో గుర్తుతెలియని వాహనం ఢీకొని ఎలుగుబంటి మృతి చెందింది. కళ్యాణ్ దుర్గం  అటవీ ప్రాంతం, నియోజక వర్గ ప్రాంతాల్లో ఎలుగుబంట్లు, చిరుతలు సంచారం ఉండటంవల్ల గతంలో  అనేక మంది రైతులు దాడికి గురయ్యారు. ఈ క్రమంలో ఎక్కువ శాతం తెల్లవారుజామున పరిసర ప్రాంతాల్లో సంచరిస్తూ ఉంటాయని అలాగే ఈరోజు ఉదయాన్నే కళ్యాణదుర్గం నుంచి అనంతపురం వెళ్లే హైవే రహదారిలో బ్రిడ్జి కింద రోడ్డు దాటుతూ వెళ్తున్న ఎలుగుబంటిని గుర్తుతెలియని వాహనం బలంగా ఢీ కొట్టడంతో అక్కడికి అక్కడే చనిపోయిందని ,దాని వయసు ఐదు సంవత్సరాలు ఉండొచ్చని అక్కడకు చేరుకున్న బెలుగుప్ప ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ గా నాగే నాయక్ తెలిపారు. పశు వైద్యాధిారులు వచ్చి పంచ నామ నిర్వహించారు.ఈ సందర్భంగా ఫారెస్ట్ అధికారులు  మాట్లాడుతూ తెల్లవారుజామున వాకింగ్  కి వెళ్లే పట్టణ ప్రజలు మరియు రైతులు  అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. ఒంటరిగా గా కాకుండా గుంపులు గా వెళ్ళాలని తెలిపారు..

 

పుంగనూరు లయ న్స్ క్ల బ్‌ నూతన కార్యవర్గం పదవిస్వీకారం

- Advertisement -

Tags:An unidentified vehicle crashed and killed a bear

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page