గులాబీ గూటికి పెద్దిరెడ్డి

0 27

కరీంనగర్ ముచ్చట్లు:

 

టీఆర్‌ఎస్ పార్టీలోకి వలసల పర్వం కొనసాగుతోంది. మాజీ మంత్రి పెద్దిరెడ్డి గులాబీ పార్టీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. శుక్రవారం సాయంత్రం ఆయన కేసీఆర్ సమక్షంలో టీఆర్‌ఎస్ పార్టీలో చేరారు. ఈ విషయాన్ని స్వయంగా ఆయనే తెలిపారు. పెద్దిరెడ్డితో పాటు మరికొంత మంది నేతలు టీఆర్‌ఎస్ తీర్థం పుచ్చుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.కరీంనగర్ జిల్లాకు చెందిన సీనియర్ నేత అయిన ఏనుగుల పెద్దిరెడ్డి.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబు నాయుడు హయాంలో మంత్రిగా పనిచేశారు. రాష్ట్ర విభజన తర్వాత మారిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో బీజేపీలో చేరారు. దుబ్బాక, నాగార్జున సాగర్ ఎన్నికల సమయంలో కీలక బాధ్యతలు నిర్వహించారు. పార్టీ తరఫున ఉపఎన్నికల ఇంఛార్జ్‌గా వ్యవహరించారు.అయితే.. మాజీ మంత్రి ఈటల రాజేందర్ బీజేపీలో చేరడం పట్ల పెద్దిరెడ్డి అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. తనను సంప్రదించకుండానే ఈటలను బీజేపీలో చేర్చుకున్నారనేది పెద్దిరెడ్డి ఆరోపణ. వాస్తవానికి హుజురాబాద్ స్థానం నుంచి ఆయన టికెట్ కూడా ఆశించారు. పెద్దిరెడ్డితో పాటు మరో నేత స్వర్గం రవి కూడా టీఆర్‌ఎస్‌లో చేరనున్నారు.హుజూరాబాద్‌ను జిల్లా చేయడం కోసం ప్రయత్నిస్తే తప్పకుండా అయ్యేదని పెద్దిరెడ్డి అన్నారు. ప్రభుత్వానికి అనుకూలమైన అభ్యర్థిని ఎన్నుకుంటే నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకోవచ్చునని అభిప్రాయపడ్డారు. తనకు రాజకీయ జీవితం ప్రసాదించింది హుజూరాబాద్ ప్రజలేనని అన్నారు. హుజురాబాద్ ఉప ఎన్నికలకు ముందు ఆయన టీఆర్‌ఎస్ పార్టీలో చేరనుండటం ప్రాధాన్యం సంతరించుకుంది.

 

- Advertisement -

శ్రీ బోయకొండ గంగమ్మ కు రాహుకాల అభిషేక పూజలు

 

Tags: Peddireddy to the pink goo

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page