జగన్న కాలనీల్లో పేదలకు కట్టించే ఇళ్ళు, చాలెంజ్ గా తీసుకోవాలి జిల్లా కలెక్టర్

0 16

తిరుపతి ముచ్చట్లు:

 

జగనన్న కాలనీలలో నిర్మిస్తున్న  ఇళ్లు చాలెంజ్ గా తీసుకొని నిర్మాణాలు చేపట్టాలని పేదలకు కట్టించే ఇళ్లు మంచి బిల్డింగ్  గా రూపుదిద్దుకోవాలని  జిల్లా కలెక్టర్ యం. హరినారాయణన్ అన్నారు. శుక్రవారం మధ్యాహ్నం  స్థానిక నగర పాలక సంస్థ  సమావేశ మందిరంలో  నగర వాసులకు కేటాయించిన జగనన్న కాలనీలో  జరగనున్న గృహ నిర్మాణాలపై నగర పాలక సంస్థ కమీషనర్ గిరీషా, జే సి (హౌసింగ్) వెంకటేశ్వర్ తో కలసి జిల్లా  కలెక్టర్, సంబంధిత ఇంజనీర్ల తో  సుదీర్ఘ  సమీక్ష నిర్వహించారు.తిరుపతి నగర వాసులకు  5 ప్రాంతాలలో 24,060  మందికి ఇంటి పట్టాలు మంజూరు  చేశామని  మొదటి విడత లొ 17,214 మందికి గృహాల నిర్మాణానికి డి పి ఆర్ పూర్తి అయిందని, జియో టాగింగ్  6,279 పూర్తయిందని, మిగిలినవి జియో టాగింగ్ ఆగష్టు 15 నాటికి పూర్తి  చేస్తామని  వివరించారు.   ప్రస్తుతం   వారం లోపు ప్రతి లే అవుట్ లో  నిర్మించుకోలేని వారి కోసం 50 వంతున ప్రయోగాత్మకంగా  నిర్మాణాలు  చేపట్టనున్నట్లు  వివరించారు.

 

 

- Advertisement -

జిల్లా  కలెక్టర్ మాట్లాడుతూ ఇంజనీరింగ్ శాఖల ఆలోచన విధానం మారాలని  మేస్త్రీలు, కూలీలు దొరకడం లేదనడం కన్నా ఇతర రాష్ట్రాల నుండి వచ్చి వేల మంది పని చేస్తున్నారని  వారి  సబ్ కాంట్రాక్టర్లను గుర్తించాలని అన్నారు.  తిరుపతి నగరానికి 24 వేల ఇండ్లు అంటే  రూ. 400 కోట్ల ప్రాజెక్టు గా  గుర్తించాలని అన్నారు.  కావాల్సిన మెటీరియల్ సప్లేయర్స్ తో మాట్లాడి కాలనీల  వద్దే తక్కువ ధరలు నిర్ణయించి అందుబాటులో ఉంచే చర్యలు తీసుకోవాలని అన్నారు.  ప్రధానంగా క్యాంపు లేబర్ ను గుర్తించాలని వారికి వసతులు ఉండేలా జగన్నన్న కాలనీలలో 10 x 60 షెడ్ల ఏర్పాటు కావాలని సూచించారు.  అలాగే జే సి హౌసింగ్, నగర పాలక సంస్థ ఇంజనీర్లు, హౌసింగ్ పి డి   చెన్నై పర్యటించి క్లబ్ క్లియరెన్స్ బోర్డు ను సంప్రదిస్తే  లేబర్ అవకాశం లభిస్తుందని, గృహాల నిర్మాణాలల్లో తిరుపతి ఐ. ఐ. టి. సహకారం      తీసుకోవాలని సూచించారు.   మరో వారం లోపు  ఇళ్ళ నిర్మాణాలు ప్రారంభం కావాలని సూచించారు.  ఇప్పటికే సొంతంగా నిర్మించుకుంటున్న వారికి స్టేజ్ పూర్తి  కాగానే వారం లోపు బిల్లులు చెల్లింపు జరగాలని అన్నారు.  మహిళల పెట్టుబడి కోసం ఎల్ డి ఎం /డి ఆర్ డి ఏ సహకారం తో  రుణాలను అందించేలా చర్యలు తీసుకోవాలని  అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యత  ప్రాజెక్టు అన్న విషయం గుర్తుండాలని సూచించారు.         ఈ కార్యక్రమం లో  ఉప కమీషనర్  చంద్ర మౌళీశ్వర్ రెడ్డి,  పి డి హౌసింగ్ పద్మనాభం, ఎస్.ఇ. మోహన్, ఎం ఇ లు చంద్ర శేఖర్, వెంకట్రామి రెడ్డి, డి ఇ లు వెంకట్రామి రెడ్డి, విజయకుమార్ రెడ్డి, చంద్రశేఖర్ రెడ్డి, రవీంద్రా రెడ్డి, సంజీవ కుమార్, గోమతి తదితరులు  పాల్గొన్నారు.

శ్రీ బోయకొండ గంగమ్మ కు రాహుకాల అభిషేక పూజలు

 

Tags: Houses built for the poor in Jagannath colonies should be taken as a challenge by the District Collector

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page