జిల్లా కేంద్రంలో బిసి బాలికల వసతి గృహం ఏర్పాటు చేయాలి

0 12

బిసి సంఘం ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ కు వినతి పత్రం

జగిత్యాల ముచ్చట్లు:
జిల్లా కేంద్రంలో బిసి బాలికల వసతి గృహం ఏర్పాటు చేయాలని కోరుతూ బిసి సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం జిల్లా అధ్యక్షుడు గాజుల నాగరాజు జిల్లా కలెక్టర్ గోగులోత్ రవి కు వినతి పత్రం అందజేశారు.ఈ సందర్భంగా నాగరాజు మాట్లాడుతూ జగిత్యాల జిల్లా బిసి జనాభాలో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోనే అత్యధికంగా జనాభా కలిగిన జిల్లా ఆని ,ఇట్టి అధిక బిసి జనాభా కలిగిన జగిత్యాలలో వెనుకబడిన తరగతుల విద్యార్థినుల తల్లిదండ్రులు తమ పిల్లల్ని జిల్లా కేంద్రంలో ఉంచి చదివించే పరిస్థితులు లేక మధ్యలోనే చదువు ఆపేయాల్సిన పరిస్థితి నెలకొందని , ఉమ్మడి జిల్లాలోనే పెద్దదైన జగిత్యాల జిల్లా కేంద్రం బిసి బాలికల వసతి గృహం లేకపోవడం బడుగు, బలహీన వెనుకబడిన తరగతుల విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని ఆన్నారు. జిల్లా మొత్తంలో కేవలం ఒక్కటంటే ఒకటే బిసి బాలికల వసతి గృహం కలిగి ఉండటం చాలా ఇబ్బంది కలిగించే విషయం ఆని , అది కూడా జిల్లా కేంద్రంలో కాకుండా మేడిపల్లి మండల కేంద్రంలో ఉందని ఆన్నారు.
జిల్లాలోని మూడు మున్సిపల్ పట్టణ కేంద్రాలు అయినటువంటి జగిత్యాల, కోరుట్ల ప్రాంతాలలో ఒక్క బిసి బాలికల వసతి గృహం లేక పోవడం చాలా బాధాకరం ఆన్నారు. మేడిపెల్లి లోని బీసీ బాలికల వసతి గృహాలను అలాగే కొనసాగిస్తూ, మిగతా జిల్లా పరిధిలోని  జగిత్యాల, కోరుట్ల, మెట్ పెల్లి పట్టణ ప్రాంతాలలో బిసి బాలికల వసతి గృహం ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్ కు కోరినట్లు నాగరాజు తెలిపారు.ఈ కార్యక్రమంలో బిసి సంక్షేమ సంఘం  రాష్ట్ర కార్యదర్శి మానాల కిషన్, బిసీ సర్పంచ్ల ఫోరం జిల్లా అధ్యక్షులు సామంతుల ప్రభాకర్, యువజన సంఘం జిల్లా అధ్యక్షులు బ్రహ్మాండబేరి నరేష్, జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ పులి నరసయ్య, జిల్లా ఉపాధ్యక్షులు పాలోజి సత్యం తదితరులు పాల్గొన్నారు.

 

- Advertisement -

పుంగనూరు లయ న్స్ క్ల బ్‌ నూతన కార్యవర్గం పదవిస్వీకారం

Tags:A BC girls’ hostel should be set up in the district center

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page