జూనియర్ ప్రకంపనలు

0 28

విజయవాడ  ముచ్చట్లు:
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు గతంలో ఎన్నడూ లేని విధంగా కొత్త కష్టాలను ఎదుర్కొంటున్నారు. సొంత పార్టీలోనే ఆయన నాయకత్వంపై నమ్మకాలు చెదిరిపోతున్నాయి. నలభై ఏళ్ల రాజకీయ జీవితంలో ఎన్నడూ చంద్రబాబు ఇంతటి క్రైసిస్ ను ఎదుర్కొనలేదు. ఒకవైపు జగన్ మరోవైపు సొంత పార్టీలో జూనియర్ ఎన్టీఆర్ ప్రకంపనలు చంద్రబాబుకు నిద్రలేకుండా చేస్తున్నాయి. ఈ సమస్య నుంచి ఎలా అధిగమించాలో చంద్రబాబుకు అర్థం కాకుండా ఉంది.ఒక చోట కాదు చంద్రబాబు వెళ్లిన ప్రతి చోటా జూనియర్ ఎన్టీఆర్ రావాలని నినాదాలు వినపడుతున్నాయి. నెక్ట్స్ సీఎం జూనియర్ ఎన్టీఆర్ అంటూ ప్లకార్డులు ప్రదర్శిస్తున్నారు. అంటే వచ్చే ఎన్నికలకు సీఎంగా జూనియర్ ఎన్టీఆర్ ను ప్రకటించాలన్నది క్యాడర్ నినాదంగా ఉంది. అంటే చంద్రబాబును ముఖ్యమంత్రిగా క్యాడర్ అంగీకరించడం లేదన్న సంకేతాలు ప్రజల్లోకి బలంగా వెళుతున్నాయి. ఇది వచ్చే ఎన్నికల్లో చంద్రబాబుకు తెలియని దెబ్బ తగులుతుందనడం వాస్తవం.నిజానికి జూనియర్ ఎన్టీఆర్ తాను రాజకీయాల్లోకి రాబోనని చెప్పేశారు. అయినా ఆయన అభిమానులు, టీడీపీ క్యాడర్ మాత్రం రావాల్సిందేనంటుంది. దీనికి ప్రధానకారణం గతంలో ఎన్నడూ లేని విధంగా పార్టీ దెబ్బతినింది. దీనికి తోడు చంద్రబాబు కుమారుడు లోకేష్ నాయకత్వాన్ని ఎవరూ స్వాగతించడం లేదు. తెలుగుదేశం పార్టీని కేవలం జూనియర్ ఎన్టీఆర్ మాత్రమే కాపాడగలడన్న విశ్వాసాన్ని క్యాడర్ వ్యక్తం చేస్తుంది.ఇది చంద్రబాబుకు రాజకీయంగా, కుటుంబ పరంగా ఇబ్బందికరంగా మారింది. అధికారంలో ఉన్న ఐదేళ్ల పాటు జూనియర్ ను చంద్రబాబు పట్టించుకోలేదు. ఇప్పుడు వచ్చి మద్దతివ్వమంటే జూనియర్ ఎన్టీఆర్ ఇస్తారా? అన్నది ప్రశ్న. రాజకీయం కోసం చంద్రబాబు ఏ స్థాయికైనా దిగివచ్చి జూనియర్ ఇంటికి వెళతారు. కానీ భవిష్యత్ లో తన కుమారుడికి జూనియర్ ఇబ్బందిగా మారతారన్న ఏకైక భావనతోనే ఆయనను దూరం పెట్టాల్సి వస్తుంది. ఎన్నికలకు మూడేళ్ల ముందే జూనియర్ నినాదం ఇలా విన్పిస్తుంటే, ఇక ఎన్నికల సమాయానికి రీసౌండ్ ఎలా ఉంటుందో చూడాలి మరి.
దగ్గుబాటి లెక్కేంటీ..
రాజకీయాల్లో దూరదృష్టితో ఆలోచించే వారే ఎక్కువ కాలం మనగలుగుతారు. అందులో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ముందు వరసలో ఉంటారు. చంద్రబాబు రాష్ట్రాభివృద్ధి గురించి కాదు తన కుటుంబం, పార్టీ గురించి కూడా దూరదృష్టితో ఆలోచిస్తారు. అధికారం కోసం ఎవరినైనా వదులుకునేందుకు సిద్ధపడతారు. ముప్పు ఉందని తెలిస్తే వారిని ముందుగానే తీసిపారేస్తారు.అసలు చంద్రబాబు అధికారంలోకి వచ్చింది, తెలుగుదేశం పార్టీని హస్తగతం చేసుకుంది అలాగే. అప్పట్లో తన తోడల్లుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావును అధికారంలోకి వచ్చేంత వరకూ ఉపయోగించుకుని ఆ తర్వాత నెట్టి పారేశారు. బాబు దెబ్బకు దగ్గుబాటి రెండు దశాబ్దాల నుంచి రాజకీయంగా కోలుకోలేకపోయారు. ఇక హరికృష్ణ కూడా పార్టీ లో తన తర్వాత అడ్డు వస్తారని భావించి ఆయనను పక్కన పెట్టేశారు.అలాంటిది జూనియర్ ఎన్టీఆర్ ను పార్టీలోకి తీసుకొచ్చి కొరివితో తలగోక్కుంటారా? అన్న ప్రశ్నను ఎవరిని అడిగినా లేదనే సమాధానం వస్తుంది. జూనియర్ ఎన్టీఆర్ రావాలంటూ క్యాడర్ రెచ్చిపోయే కొద్దీ చంద్రబాబు ఆ ఫ్యామిలీని మరింత దూరం చేస్తారన్నది వాస్తవం. అందరూ కోరినట్లు, కోరుతున్నట్లు చంద్రబాబు జూనియర్ ఎన్టీఆర్ ను పార్టీలోకి తెచ్చి పదవులు ఇచ్చి నెత్తిమీద కూర్చోబెట్టుకునే ప్రస్తకి లేదు. ఇది అందరికీ తెలిసిన సత్యమే.కాని ఎన్నికల సమయానికి జూనియర్ ఎన్టీఆర్ తో ప్రచారం చేయించే కార్యక్రమానికి మాత్రం చంద్రబాబు ప్రయత్నాలు చేస్తే చేయవచ్చు. ఎందుకంటే అది తనకు ఉపయోగం. జూనియర్ ఎన్టీఆర్ ను కేవలం ప్రచార రధానికే పరిమితం చేస్తారు తప్పించి పార్టీ పదవులు ఇచ్చే అవకాశం లేదు. అయితే తెలుగుదేశం పార్టీని కాపాడుకోవడానికి జూనియర్ వస్తారా? రారా? అన్నది ఆయనే తేల్చుకోవాలని చంద్రబాబు అన్నా అనవచ్చు. మొత్తం మీద చంద్రబాబు క్యాడర్ ఎంత గగ్గోలు పెట్టినా జూనియర్ విషయంలో ఎటువంటి వత్తిళ్లకు లొంగరు. ఎందుకంటే ఆయన చంద్రబాబు..

పుంగనూరు లయ న్స్ క్ల బ్‌ నూతన కార్యవర్గం పదవిస్వీకారం

 

- Advertisement -

Tags:Junior Vibrations

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page