జ‌న‌వ‌రి 14న విడుద‌ల కానున్న‌ రెబెల్ స్టార్ ప్రభాస్, యూవి క్రియేషన్స్, గోపీకృష్ణ మూవీస్, రాధా కృష్ణ చిత్రం రాధేశ్యామ్

0 14

హైదరాబాద్‌ ముచ్చట్లు:

రెబల్ స్టార్ ప్రభాస్, గాడ్జియస్ బ్యూటీ పూజా హెగ్డే జంటగా రాధాకృష్ణ కుమార్ తెరకెక్కిస్తున్న రొమాంటిక్ లవ్లీ ఎంటర్టైనర్ రాధే శ్యామ్. పాన్ ఇండియన్ సినిమాగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు దర్శకుడు రాధాకృష్ణ కుమార్. అన్ని భాషలలో కూడా రాధే శ్యామ్ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఇప్పటికే విడుదలైన ప్రభాస్, పూజా హెగ్డే ఫస్ట్ లుక్ లకు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. మోషన్ పోస్టర్, ఫ‌స్ట్ గిమ్స్ కు మంచి స్పందన వచ్చింది. గ‌తంలో రాధేశ్యామ్ చిత్రాన్ని జూలై 30న విడుద‌ల చేయ‌డానికి స‌న్నాహాలు జ‌రిగాయి, అయితే కోవిడ్ సెకండ్ వేవ్ కార‌ణంగా ప్ర‌స్తుత ప‌రిస్థితుల రీత్య ఈ భారీ ల‌వ్లీ విజువ‌ల్ వండ‌ర్ ని వ‌చ్చే ఏడాది సంక్రాంతి కానుక‌గా జ‌న‌వ‌రి 14న ప్రేక్ష‌కుల ముందుకి తీసుకువస్తున్నట్లుగా అధికారిక ప్ర‌క‌ట‌ణ విడుద‌లైంది. టిప్ టాప్ సూట్ లో ఫుల్ క్లాసీ లుక్ లో ఉన్న రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ స్టిల్ తో ఉన్న పోస్ట‌ర్ ద్వారా రాధేశ్యామ్ కొత్త విడుద‌ల తేది ప్ర‌క‌టించ‌డం జ‌రిగింది. రెబ‌ల్ స్టార్ డా.యూ.వి.కృష్ణంరాజు స‌మ‌ర్ప‌ణ‌లో ప్ర‌ముఖ నిర్మాణ సంస్ధ‌లు గోపీ కృష్ణ మూవీస్, యూవీ క్రియేష‌న్స్ భారీ బడ్జెట్ తో రాధే శ్యామ్ సినిమాను అత్యంత ప్ర‌తిష్ఠాత్మ‌కంగా నిర్మిస్తున్నారు. వంశీ, ప్ర‌మోద్, ప్ర‌సీధ‌లు ఈ పాన్ ఇండియా సినిమాకు నిర్మాత‌లుగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. ప్ర‌ముఖ మ్యూజిక్ డైరెక్ట‌ర్ జ‌స్టిన్ ప్ర‌భాక‌ర‌న్ ఈ చిత్రానికి సంబంధించిన తెలుగు, క‌న్న‌డ‌, త‌మిళ‌, మ‌ళ‌యాలీ వెర్ష‌న్స్ కు సంగీతాన్ని అందిస్తున్నారు. హిందీ వెర్షన్ కు మిథూన్, మనన్ భరద్వాజ్ సంగీతం అందిస్తున్నారు. జ‌న‌వ‌రి 14న‌ ఏక‌కాలంలో హిందీ, త‌మిళ‌, తెలుగు, క‌న్న‌డ‌, మ‌ళ‌యాలం భాష‌ల్లో రాధేశ్యామ్ భారీ రేంజ్ లో విడుద‌ల చేయ‌డానికి నిర్మాత‌లు స‌న్నాహాలు చేస్తున్నారు.నటీనటులు: ప్రభాస్, పూజా హెగ్డే..

 

 

- Advertisement -

పుంగనూరు లయ న్స్ క్ల బ్‌ నూతన కార్యవర్గం పదవిస్వీకారం

Tags: Rebel star Prabhas, UV Creations, Gopikrishna Movies, Radha Krishna movie Radheshyam to be released on January 14

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page