టీ కాంగ్రెస్ నేతలకు… పోలీసు అడ్డంకులు

0 9

హైదరాబాద్   ముచ్చట్లు:

 

 

టీ కాంగ్రేస్ కు పోలీసులతీరు  స‌వాల్ గా మారిందా  … ఓ వైపు అధికార పార్టీ ,మ‌రో వైపు పోలీసుల‌తో పోరాడాల్సిన ప‌రిస్తితి హ‌స్తం పార్టీ కి ఎర్ప‌డిందా ..అందుకే  ఈ మ‌ధ్య కాంగ్రేస్ నేత‌లు పోలుసుల కు వార్నింగ్  ఇవ్వ‌డ‌మే కాక  అధికారంలోకి వ‌చ్చాక మీ అంతు చూస్తామ‌ని హెచ్చ‌రిస్తున్నారా ..అస‌లు పోలీసులంటె ఏందుకు అంత కోపం .కాంగ్రెస్ నేతల పట్ల పోలీసులు వ్యవరిస్తున్న తీరు సరైందేనా…ఈ మ‌ధ్య తెలంగాణ కాంగ్రేస్ నేత‌లు పోలీసులంటేనే ఓంటికాలు మీద లేస్తున్నారు . వ‌చ్చేది మా ప్ర‌భుత్వ‌మే మీ అంతు చూస్తాం అంటూ భారీ డైలాగులు కోడుతున్నారు . ఇటీవ‌ల కాలంలో కాంగ్రేస్ కు కోత్త పీసీసీ టీం ను నియ‌మించిన త‌ర్వాత వ‌రుస కార్య‌క్ర‌మాలు చేప‌డుతున్నారు టీ కాంగ్రేస్ నేత‌లు ..అయితే ఈ కార్య‌క్ర‌మాల నిర్వ‌హాన‌కు పోల‌సులు అడ్డంకిగా మారారు. కార్య‌క్ర‌మాలు నిర్వ‌హించాల‌నుకునే ఓక రోజు ముందు నుంచే పార్టీ నేత‌ల‌ను అరెస్ట్ చేసి పార్టీ కార్య‌క్ర‌మాలు స‌క్సెస్ కాకుండా చూస్తున్నార‌ని  తీవ్ర అస‌హానం పోలీసుల పై వ్య‌క్తం చేస్తున్నారు హ‌స్తం పార్టీ నేత‌ కోకాపేట భూముల అమ్మ‌కాలలో భారీ కుంభ‌కోణం జ‌రిగింద‌ని టీ పీసీసీ అధ్య‌క్షుడు రేవంత్ రెడ్డి ఆరోపించారు … ఆ త‌ర్వాత కోకాపేట భూముల ప‌రిశీల‌ను పిలుపునివ్వ‌డంతో రేవంత్ రెడ్డి .జ‌గ్గారెడ్డి ,మ‌ళ్ళు భ‌ట్టి విక్ర‌మార్క తో పాటు  కాంగ్రేస్ ముఖ్య‌నేత‌లంద‌రిని హ్‌స్ అరెస్ట్ చేసారు … ఆ త‌ర్వాత పెట్రోల్ ,డిజిల్ ధ‌ర‌ల పెంపు ద‌ల‌కు నిర‌స‌న‌గా బీజేపి ,టిఆర్ఏస్ ల కు వ్య‌తిరేకంగా ఇందిరా పార్క్  నుంచి రాజ్ భ‌వ‌న్ ర్యాలీ భారీ ర్యాలీ ప్లాన్ చేసింది కాంగ్రేస్ పార్టీ అయితే ముఖ్యనేత‌లంద‌రిని ఇందిరా పార్క్ వ‌ర‌కు అనుమ‌తి ఇచ్చిన పోల‌సులు రాజ్ భ‌వ‌న్ కు వెళ్ళే క్ర‌మంలో  కాంగ్రేస్ నేత‌ల‌ను పోలీసులు  అరెస్ట్ చేసారు .కాంగ్రేస్ ముఖ్య‌నేత‌ల ఫోన్ ట్యాపింగ్ వ్య‌వ‌హారంలోను కాంగ్రేస్ చేప‌ట్టిన నిర‌స‌న కార్య‌క్ర‌మాల‌కు  పోలుసులు తీవ్ర అడ్డంకులు సృష్టించిన పోలీసులు ఎన్ఎస్యూఐ రాష్ట్ర అద్యక్షుడు బలమూరి వెంకట్ ను పిడిగుద్దులు గుద్ది తీవ్రంగా గాయపరిచారని, కావాలనే టార్గెట్ చేసి దాడి చేశారని హ‌స్తం నేత‌లు ఆరోపిస్తున్నారు .మరోవైపు  రేషన్ కార్డు ల పంపిణీ కార్యక్రమంలో మంత్రి జగదీష్ రెడ్డి ని నిలదీసినందుకు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి ని స్థానిక అధికారుల కంప్లైంట్ మేరకు పోలీసులు అరెస్టు చేసారు.దీనిపై కూడా కాంగ్రెస్ నేతలు తీవ్ర ఆగ్రహం గా ఉన్నారు ..
కాంగ్రేస్ పార్టీ  ఏ కార్య‌క్ర‌మం చేప‌ట్టినా ముంద‌స్తు అరెస్ట్ లు స‌ర్వ సాదార‌నం అయిపోయాయ‌ని ..కావాల‌నే కోంద‌రు పోలీసులు అత్యుస్సాహం ప్ర‌ద‌ర్శిస్తున్నార‌నేది కాంగ్రేస్ నేత‌ల అభిప్రాయం.మ‌రికోంద‌రు పోలీసులు   టిఆర్ఏస్ నేత‌లకు ఊడిగం చేస్తున్నార‌ని  ,వాళ్లు చెప్పిన‌ట్లే చేస్తున్నారు …ప్ర‌తి ప‌క్ష పార్టీల‌ను అన‌గ‌దోక్కేందుకు టిఆర్ఏస్ ప్ర‌భుత్వం  పోలీసు వ్య‌వ‌స్త‌ను వాడుకుంటుంన్నార‌నేది కాంగ్రేస్ ఆరోప‌ణ .ఈ సంఘటనలపై ఈ నెల 28న రాష్ట్ర డిజిపిని  మాజి మంత్రి శ్రీధర్ బాబు,మాజి ఎంపి అంజన్ కుమార్ యాదవ్, ఎన్ఎస్ యూఐ నేతలు కలిసి ఫిర్యాదు చేశారు.
అయితే ఇక నుంచి పోలీసులు చేస్తున్న ఆగ‌డాల‌ను చూస్తూ ఊరుకునేది లేద‌ని , ఇలా గే కాంగ్రేస్ చేప‌ట్టే కార్య‌క్ర‌మాల‌కు పోలుసులు అడ్డుప‌డితే ..భ‌విష్య‌త్ లో పోలీసు స్టేష‌న్ లు ముట్టడిస్తామ‌ని చెప్పారు… ముందుగా పోలీసుల‌ను ఎదుర్కొంటుంటే ..త‌ర్వాత ప్ర‌భ‌త్వం పై ఈజీగా పోరాడోచ్చేద‌నేది కాంగ్రేస్ నేత‌ల ఆలోచ‌న…దీనిపై కాంగ్రేస్ నేత‌లు వ్యూహాలు ర‌చిస్తున్న‌ట్లు స‌మాచారం….

 

- Advertisement -

పుంగనూరు లయ న్స్ క్ల బ్‌ నూతన కార్యవర్గం పదవిస్వీకారం

 

Tags:Tea for Congress leaders … police barriers

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page