త్వరలో సందేశ్ యాప్

0 42

న్యూఢిల్లీ    ముచ్చట్లు:

దిగ్గజ మెసేంజర్‌ యాప్‌ వాట్సాప్‌ ప్రైవసీ విషయంలో విమర్శలు వెళ్లువెత్తుతున్న వేళ కేంద్రం దానికి పోటీగా అలాంటి ఫీచర్లు కలిగిన కొత్త యాప్‌ ను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఆ వివరాలు తెలుసుకుందాం.ఈ యాప్‌ పేరు ‘సందేశ్‌’ అని నామకరణం చేసింది కేంద్ర ప్రభుత్వం. ఈ యాప్‌ కు సంబంధించిన వివరాలను కేంద్ర మంత్రి రాజీవ్‌ చంద్రశేఖర్‌ లోక్‌ సభకు వివరించారు. ఈ యప్‌ చాలా సురక్షితమైందని తెలిపారు. అంతేకాదు ఈ యాప్‌ కు సంబంధించిన నియంత్రణను కేంద్ర ప్రభుత్వమే చూసుకుంటుందని చెప్పారు. వాట్సాప్‌ మాదిరిగా మెసేజింగ్, ఫైల్, మీడియా షేరింగ్, ఆడియో, వీడియో కాల్స్‌ ఇతర ఫీచర్లు ఈ యాప్‌లో రూపొందించారు. ఈ యాప్‌ను గూగుల్‌ ప్లే స్టోర్‌ తో పాటు యాపిల్‌ స్టోర్‌ లోనూ అందుబాటులో ఉంచుతున్నామని చంద్రశేఖర్‌ వివరించారు. ఈ యాప్‌ ను నేషనల్‌ ఎన్ఫోర్మేటిక్స్‌ సెంటర్‌ అభివృద్ధి చేసింది.
అయితే ఇప్పటివరకు కేవలం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు మాత్రమే వాడుతున్న ఈ యాప్‌ ఇప్పుడు అందరికీ అందుబాటులోకి వచ్చేసింది.ఈ యాప్‌ వివరాలుయాప్‌ కు వెబ్‌ వెర్షన్‌ కూడా అందుబాటులో ఉంది. సందేశ్‌ వెబ్‌ పోర్టల్‌ ద్వారా దీనిని వినియోగించుకోవచ్చు. అందులో మొబైల్‌ నంబర్‌ లేదా ఈ మెయిల్‌ ఐడీని నమోదు చేయాల్సి ఉంటుంది. అనంతరం ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని నమోదు చేస్తే సందేశ్‌ వెబ్‌ ఓపెన్‌ అవుతుంది.ఇప్పటివరకు ప్రభుత్వ ఈ మెయిల్‌ ఐడీతో మాత్రమే సందేశ్‌ లో ఖాతా తెరవాలనే నిబంధన ఉండేది. అయితే ఇప్పుడు ఈ నిబంధనను మార్చారు.
ప్రైవసీ విషయంలో ఎలాంటి అభ్యంతరం లేకుండా ఈ యాప్‌ను వినియోగించుకోవచ్చు.ఈ యాప్‌ కేవలం యాప్‌ ద్వారానే కాకుండా.. ఈమెయిల్‌ ద్వారా కూడా ఓపెన్‌ చేయవచ్చు.

- Advertisement -

పుంగనూరు లయ న్స్ క్ల బ్‌ నూతన కార్యవర్గం పదవిస్వీకారం

 

Tags:Message app coming soon

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page