దళితులను మోసం చేసిన కేసీఆర్ ను అడుగడుగునా అడ్డుకోవాలి

0 11

– బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ పిలుపు

 

హైదరాబాద్  ముచ్చట్లు :

 

- Advertisement -

ఎన్నికల కోసమే పథకాలు ప్రవేశ పెడుతూ కేసీఆర్ ప్రజలను పదే పదే మోసం చేస్తున్నారని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ విమర్శించారు. బ‌డుగుల ఆత్మ‌గౌర‌వ‌ పోరు స‌భ‌ లో ఆమె పాల్గొని ప్రసంగించారు.దళిత ముఖ్యమంత్రి, మూడెకరాల భూమి, డబుల్ బెడ్ రూమ్ ఇల్లు ఎక్కడికి పోయాయి కేసీఆర్..చెప్పాలని డిమాండ్ చేసారు.దళితులను మోసం చేసిన కేసీఆర్ ను అడుగడుగునా అడ్డుకోవాలని పిలుపు నిచ్చారు.హుజురాబాద్ లో భాజపా కేసీఆర్ కు చమటలు పట్టిస్తోందని..హుజురాబాద్ ఎన్నికలు రాగానే కేసీఆర్ కు దళితులు గుర్తుకు వచ్చారని దుయ్యబట్టారు.హుజురాబాద్ కోసమే దళిత బంధు పెడుతానన్న ముఖ్యమంత్రిని ప్రగతి భవన్ ను నుంచి తరిమేయాలన్నారు.కేసీఆర్ కు దమ్ముంటే దళిత బంధును రాష్ట్రమంతా అమలు చేయాలని డిమాండ్ చేసారు.బిజెపి వల్లే దళిత బంధు పథకం వచ్చింది..హుజురాబాద్ ఎన్నికల్లో ఖర్చు పెట్టేందుకే ప్రభుత్వ భూములను వేలం వేశారు..తెరాస కబంధ హస్తాల నుంచి విముక్తి కలగాలంటే ఈటల రాజేందర్ ను గెలిపించాలని విజ్ఞప్తి చేసారు.ముఖ్యమంత్రి కేసీఆర్ తన ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించాలి..ఉప ఎన్నిక కోసం కేసీఆర్ చిల్లర రాజకీయాలు చేస్తున్నారని,అబద్దాలు అడడంలో కేసీఆర్ ను మించిన వ్యక్తి దేశంలోనే లేడన్నారు.రాష్ట్రంలో ఉన్న అన్ని వ‌ర్గాల‌ను కేసీఆర్ మోసం చేశారన్నారు.5 ఏళ్ల‌లో ఎస్సీ, ఎస్టీ స‌బ్ ప్లాన్ నిధుల‌ను 10శాతం కుడా ఖ‌ర్చు చేయాలేదంటేనే కేసీఆర్ చిత్తశుద్ధి ఎంటో అర్థం అవుతోందన్నారు.బ‌డుగుల కోసం పోరాటం చేసే దుస్థితి రాష్ట్రంలో రావ‌డం సిగ్గుచేటని అరుణ పేర్కొన్నారు.

 

పుంగనూరు లయ న్స్ క్ల బ్‌ నూతన కార్యవర్గం పదవిస్వీకారం

Tags: KCR which deceived the Dalits should be stopped at every step

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page